ఆ అమ్మాయిలు అన్నయ్య అని పిలవడంతో బాధపడ్డ సాయితేజ్.. ఏమైందంటే?

యంగ్ జనరేషన్ హీరోలలో సాయితేజ్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.తక్కువ సంఖ్యలో సినిమాలే చేసినా వివాదాలకు దూరంగా ఉన్న సాయితేజ్ యాక్సిడెంట్ తర్వాత నిదానంగా సినిమాలు చేస్తున్నారు.

 Saitej Comments Goes Viral In Social Media Details, Saitej, Sai Dharam Tej, Saitej Comments, Pawan Kalyan, Vinodaya Sitham Remake, Nagababu, Pilla Nuvvu Leni Jeevitham Movie, Mega Family,-TeluguStop.com

ప్రస్తుతం సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ తో పాటు ఒక సినిమాలో సాయితేజ్ నటిస్తున్నారు.వినోదాయ సిత్తం రీమేక్ లో పవన్ కళ్యాణ్ కూడా నటిస్తుండటంతో సాయితేజ్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే సాయితేజ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హిట్లు వస్తే తర్వాత సినిమాలతో కుడా సక్సెస్ సాధించాలనే బాధ్యత పెరుగుతుందని సాయితేజ్ అన్నారు.

 Saitej Comments Goes Viral In Social Media Details, Saitej, Sai Dharam Tej, Saitej Comments, Pawan Kalyan, Vinodaya Sitham Remake, Nagababu, Pilla Nuvvu Leni Jeevitham Movie, Mega Family, -ఆ అమ్మాయిలు అన్నయ్య అని పిలవడంతో బాధపడ్డ సాయితేజ్.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నా తొలి సినిమా రేయ్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కావడానికి ఏకంగా ఐదేళ్లు పట్టిందని సాయితేజ్ పేర్కొన్నారు.పిల్లా నువ్వు లేని జీవితం సినిమా సమయంలో శ్రీహరి గారు చనిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు.

Telugu Nagababu, Pawan Kalyan, Pillanuvvu, Sai Dharam Tej, Saitej, Vinodaya Sitham-Movie

ఆయనకు బదులుగా జగపతిబాబుతో షూటింగ్ ను పూర్తి చేశామని ఆయన చెప్పుకొచ్చారు.నాకు నచ్చని పనిని నేను చేయనని ఆయన పేర్కొన్నారు.నేను యావరేజ్ స్టూడెంట్ నని ఒకవేళ నేను సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే నిరుద్యోగిగా మిగిలిపోయేవాడినని సాయితేజ్ అన్నారు.నాగబాబు గారు నన్ను జాగ్రత్తగా తీసుకున్నారని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

నాగబాబు గారు నా జీవితంలో ముఖ్య పాత్ర పోషించారని సాయితేజ్ వెల్లడించారు.

Telugu Nagababu, Pawan Kalyan, Pillanuvvu, Sai Dharam Tej, Saitej, Vinodaya Sitham-Movie

కెరీర్ మొదలుపెట్టిన తర్వాత కళ్యాణ్ బాబాయ్ చూసుకున్నారని సాయితేజ్ అన్నారు.సీనియర్ నరేష్ అబ్బాయి నవీన్ నా బెస్ట్ ఫ్రెండ్ అని ఆయన చెప్పుకొచ్చారు.నేను కాలేజ్ కు వెళ్లకపోతే టీచర్లు ఫీలయ్యేవారని సాయితేజ్ తెలిపారు.

నాకు అమ్మాయిలు ఎవరూ ప్రపోజ్ చేయలేదని నేను ప్రపోజ్ చేశానని సాయితేజ్ అన్నారు.నేను చాలామందికి ప్రపోజ్ చేసినా ఎప్పుడూ వర్కౌట్ కాలేదని నావన్నీ హార్ట్ బ్రేకింగ్ అని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

కొంతమంది ఫ్రెండ్ అనుకున్నానని చెప్పేవారని మరి కొందరు బ్రదర్ అని అనేవారని అలా అంటే నాపై నాకు అసహ్యంగా అనిపించేదని సాయితేజ్ కామెంట్లు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube