'సైరా' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌  

Saira Narasimha Reddy First Day Collections-nayanathara,saira Narasimha Reddy

చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.సినిమా ప్రారంభం నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా కష్టపడ్డారు.అలాగే ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

Saira Narasimha Reddy First Day Collections-nayanathara,saira Narasimha Reddy-Saira Narasimha Reddy First Day Collections-Nayanathara

275 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంకు ఆ స్థాయిలో బిజినెస్‌ జరిగింది.మరి కలెక్షన్స్‌ ఎలా వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చి మంచి వసూళ్లు రాబట్టింది.

Saira Narasimha Reddy First Day Collections-nayanathara,saira Narasimha Reddy-Saira Narasimha Reddy First Day Collections-Nayanathara

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల వరకు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.పూర్తి సమాచారం అయితే ఇంకా రాలేదు కాని 50 కోట్లకు అటు ఇటుగా రాబట్టింది.యూఎస్‌లో మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా దుమ్ము రేపే విధంగా వసూళ్లను రాబట్టింది.

యూఎస్‌లో ప్రీమియర్స్‌ ద్వారా మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందని ఆశించారు.కాని అక్కడ కేవలం 8 లక్షల డాలర్లను మాత్రమే రాబట్టింది.

యూఎస్‌ టాప్‌ ప్రీమియర్‌ కలెక్షన్స్‌లో ఈ చిత్రం నిలవలేక పోయింది.సాహో, స్పైడర్‌ చిత్రాల స్థాయిలో కూడా యూఎస్‌లో ప్రీమియర్‌ కలెక్షన్స్‌ను సైరా రాబట్టలేక పోయింది.మిగిలిన అన్ని చోట్ల కూడా మంచి టాక్‌ కారణంగా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.

వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి ఖచ్చితంగా 200 కోట్ల వరకు వసూళ్లు అవ్వడం ఖాయం అంటూ చాలా నమ్మకంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బ్రేక్‌ చేయనుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.