బాలీవుడ్‌లో 'సైరా' కనిపించడం లేదేం?

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ చిత్రంను హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు.

 Sairan Narasimha Reddy Latestupdate From Bollywood-TeluguStop.com

ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.రికార్డు స్థాయి వసూళ్లను ఈ చిత్రం నమోదు చేయడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.

కాని సినీ విశ్లేషకులు మాత్రం ఈ చిత్రం కాస్త అటు ఇటు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు.

Telugu Amirkhan, Amithabachan, Sairansimha-

  ముఖ్యంగా బాలీవుడ్‌లో సైరా చిత్రంకు ఆశించిన స్థాయిలో క్రేజ్‌ రాలేదు.బిగ్‌బి అమితాబచ్చన్‌ ఈ చిత్రంలో నటించిన అమీర్‌ ఖాన్‌ ఈ చిత్రం ట్రైలర్‌ను బాగుంది అంటూ ట్వీట్‌ చేసినా కూడా వచ్చే ఆధరణ తక్కువగానే కనిపిస్తుంది.ట్రైలర్‌కు అక్కడ ఎక్కువ ఆధరణ దక్కలేదు.

ఇదే సమయంలో అక్కడ థియేటర్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిచండం లేదు.ఎందుకంటే అదే రోజున బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

అందుకే ఎక్కువగా ఆ సినిమాలకు థియేటర్లు కేటాయించనున్నారు.

Telugu Amirkhan, Amithabachan, Sairansimha-

  సాహో స్థాయిలో సైరా చిత్రంను విడుదల చేయడం అసంభవం అని తేలిపోయింది.కనీసం సాహోలో సగం థియేటర్లలో అయినా సైరాను విడుదల చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పలువురు ఈ చిత్రం గురించి స్పందిస్తున్నా ప్రేక్షకుల్లో మాత్రం సినిమాపై అంచనాలు పెరగడం లేదు.

కనీసం ఆసక్తి కూడా చూపించడం లేదు అంటూ బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం చాలా చాపకింద నీరులా బాలీవుడ్‌ ప్రేక్షకులకు సైరా ఎక్కనుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube