బంపర్ ఆఫర్ సీక్వెల్ ఎనౌన్స్ చేసిన సాయిరాం శంకర్

పూరీ జగన్నాథ్ తమ్ముడుగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు సాయిరాం శంకర్.పూరీ జగన్నాథ్ తన సినిమాలతోనే తమ్ముడుని నటుడుగా చేశాడు.

 Sairam Shankars Bumper Offer 2 Announced-TeluguStop.com

నేనింతే సినిమాలో మొదటిగా తెరంగేట్రం చేయించి తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 143 అనే సినిమాతో సాయిరాం శంకర్ తెరంగేట్రం చేశాడు.అయితే ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో మరల పూరీ నిర్మాణంలో బంపర్ ఆఫర్ సినిమాతో తమ్ముడికి సాలిడ్ సక్సెస్ అందించాడు.

ఆ సినిమాతో తన శిష్యుడు జయరవీంద్రని దర్శకుడుగా పరిచయం చేశాడు.ఈ సినిమా అతని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.

 Sairam Shankars Bumper Offer 2 Announced-బంపర్ ఆఫర్ సీక్వెల్ ఎనౌన్స్ చేసిన సాయిరాం శంకర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత సాయిరాం శంకర్ హీరోగా చాలా సినిమాలు చేసిన ఏ ఒక్కటి అతనికి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు.దీంతో పూరీ జగన్నాథ్ తమ్ముడు అనే బ్రాండ్ ఉన్న కూడా హీరోగా సక్సెస్ కాలేకపోయిన నటుడుగా సాయిరాం శంకర్ మిగిలిపోయాడు.

అతనికి అవకాశాలు భాగానే వస్తున్నా కూడా ఆ సినిమా కథలు జనాన్ని మెప్పించే స్థాయిలో ఉండటం లేదనేది టాక్.

ఈ నేపధ్యంలో సాయిరాం శంకర్ మరల తనకి బంపర్ ఆఫర్ తో హిట్ ఇచ్చిన దర్శకుడు జయరవీంద్రనే మళ్ళీ నమ్ముకున్నాడు.బంపర్ ఆఫర్ సీక్వెల్ ని ఎనౌన్స్ చేశారు.అయితే ఇది మొదటి కథకి కొనసాగింపుగా కాకుండా పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని తెలుస్తుంది.

పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథని జయరవీంద్ర సిద్ధం చేసినట్లు బోగట్ట.ఇక ఈ సినిమాలో సాయిరాం శంకర్ హీరోగా చేయడంతో పాటు నిర్మాత అవతారం కూడా ఎత్తుతున్నాడు.

వేరొక నిర్మాతతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.మరి బంపర్ ఆఫర్ బ్రాండ్ తో సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా అతనికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.

#Jaya Ravindra #SaiRam Shankar #Puri Jagannadh #Bumper Offer 2 #SairamShankar's

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు