ట్రైలర్‌ టాక్‌ : బాహుబలి స్థాయిలో చూపించేందుకు చాలానే కష్టపడ్డారు  

Saira Narasimha Reddy Trailer Talk-chiranjeevi,konidela Productions,nayanathara,saira Narasimha Reddy

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలకు సిద్దం అయ్యింది.గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా చిత్రం ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.సైరా చిత్రం గురించి మొదటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి.ఆ అంచనాలు మరింత పెరిగేలా ఈ ట్రైలర్‌ ఉంది.బాహుబలి రేంజ్‌లో సైరా చిత్రాన్ని తీయాలని నిర్మాత రామ్‌ చరణ్‌, దర్శకుడు సురేందర్‌ రెడ్డి చాలా ఆశ పడ్డారు.

Saira Narasimha Reddy Trailer Talk-chiranjeevi,konidela Productions,nayanathara,saira Narasimha Reddy-Saira Narasimha Reddy Trailer Talk-Chiranjeevi Konidela Productions Nayanathara

అనుకున్నట్లుగానే ఆ స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రంను తీసినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

Saira Narasimha Reddy Trailer Talk-chiranjeevi,konidela Productions,nayanathara,saira Narasimha Reddy-Saira Narasimha Reddy Trailer Talk-Chiranjeevi Konidela Productions Nayanathara

మొదట ఈచిత్రంను 150 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మించాలని భావించారు.కాని మెల్ల మెల్లగా ఈ చిత్రం బడ్జెట్‌ ఏకంగా 300 కోట్లకు చేరింది.బాహుబలి స్థాయిలో ఈ చిత్రంకు ఖర్చు చేయడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే సైరా చిత్రం ఆ స్థాయిలో ఉంటుందా అనే అనుమానాలు కొందరిలో వ్యక్తం అయ్యాయి.తాజాగా ట్రైలర్‌ చూసిన తర్వాత బాహుబలి స్థాయికి సైరాను తీసుకు వచ్చేందుకు చాలా కష్టపడ్డట్లుగా కనిపిస్తోంది.

భారీ యుద్ద సన్నివేశాలు, విజువల్‌ వండర్‌గా అనిపించే గ్రాఫిక్స్‌తో సైరా దుమ్ము రేపడం ఖాయం అన్నట్లుగా ఉంది.రికార్డుల వర్షం కురిపించేందుకు సైరా చిత్రం సిద్దం అవుతుందని మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా చెబుతున్నారు.గాంధీ జయంతి రోజు ఈ సినిమా సందడి మామూలుగా ఉండబోవడం లేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

సాహో, బాహుబలి రికార్డులను చేరేందుకు సైరాకు పెద్దగా కష్టం కాదంటూ కూడా మెగా ఫ్యాన్స్‌ చాలా ధీమాగా ఉన్నారు.మరి ఫలితం ఏమయ్యేనో చూడాలి.