తెలుగు సినీ చరిత్రలో తొలిసారి 'సైరా' కోసం ఆ ప్రయోగం...

తెలుగు సినిమా స్థాయి బాహుబలితో అమాంతం పెరిగింది.సినిమాల బడ్జెట్‌ విషయంలో బాలీవుడ్‌ను బీట్‌ చేస్తున్నారు.

 Saira Narasimha Reddy Record Breaking With 1000 Dancers-TeluguStop.com

బాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్మాణాత్మక విలువలతో టాలీవుడ్‌ స్థాయిని అమాంతం పెంచేస్తున్నారు.స్టార్‌ హీరోల సినిమాలు తక్కువలో తక్కువ 60 కోట్లు ఉంటుంది.

ఇక టాప్‌ గా మూడు నాలుగు వందల కోట్లు కూడా ఖర్చు చేస్తున్నారు.ప్రస్తుతం చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ సైరా చిత్రాన్ని దాదాపు 300 కోట్లతో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలోని ప్రతి సీన్‌ మరియు పాట కూడా నభూతో నభవిష్యతి అన్న రీతిలో షూట్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఒక ఫైట్‌ కోసం వందలాది మంది ఫైటర్స్‌ను వినియోగించి చిత్రీకరించిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి త్వరలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఒక పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.రామోజీ ఫిల్మ్‌ సిటీలో అత్యంత భారీ ఖర్చుతో సెట్టింగ్‌ వేస్తున్నారు.ఇక ఈ పాటలో వెయ్యి మంది డాన్సర్లు మరియు 15 వందల మంది జూనియర్‌ ఆర్టిస్టులు కనిపించబోతున్నారట.

దాదాపు వారం రోజుల పాటు చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.వారం రోజుల చిత్రీకరణకు ముందు అయిదు రోజుల పాటు వెయ్యి మంది డాన్సర్స్‌ ప్రాక్టీస్‌ చేయబోతున్నారు.

ఇంత భారీ పాటలో చిరంజీవి, తమన్నా, నయనతార, విజయ్‌ సేతుపతి ఇంకా పలువురు స్టార్స్‌ కూడా కనిపించబోతున్నారు.ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో వినయ విధేయ రామ చిత్రంలో చేసిన 500 మంది డాన్సర్స్‌తో పాటనే రికార్డు.ఇప్పుడు సైరా చిత్రం ఆ రికార్డును బ్రేక్‌ చేయబోతుంది.వెయ్యి మంది డాన్సర్స్‌ను మెయింటెన్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.మరి దర్శకుడు సురేందర్‌ రెడ్డి వారందరిని ఎలా మెయింటెన్‌ చేస్తాడో, ఆ పాటకు కొరియోగ్రఫీ ఎవరు అందించబోతున్నారో అనే విషయాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube