అలా చేస్తే కోపం వస్తుందంటున్న సాయిపల్లవి

తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా సాయిపల్లవి స్టార్ హీరోయిన్లను మించి ప్రేక్షకుల్లో గుర్తింపును సొంతం చేసుకున్నారు.కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకు పారితోషికం కంటే గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలే ముఖ్యమని సాయిపల్లవి చెబుతున్నారు.

 Saipallavi Says About Her Angriness On Sekhar Kammula-TeluguStop.com

డాక్టర్ చదివి యాక్టర్ అయిన సాయిపల్లవి సినిమా ఆఫర్లు తగ్గిన డాక్టర్ గా కొనసాగుతానని వెల్లడించారు.తాజాగా సాయిపల్లవి నంబర్ 1 యారి షోకు చైతన్య, శేఖర్ కమ్ములతో కలిసి హాజరయ్యారు.

ఆ షోలో సాయిపల్లవి మాట్లాడుతూ శేఖర్ కమ్ముల చైతన్యను మెచ్ఛుకుంటే తనకు కోపం వస్తుందంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.శేఖర్ కమ్ముల విషయంలో తాను కొద్దిగా పొసెసివ్ అని ఆమె అన్నారు.

 Saipallavi Says About Her Angriness On Sekhar Kammula-అలా చేస్తే కోపం వస్తుందంటున్న సాయిపల్లవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శేఖర్ కమ్ముల చైతన్యను పొగిడితే తనకు కోపం వస్తుందని ఆమె చెప్పారు.తనకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలలో తాను శేఖర్ కమ్ములకు సలహాలు ఇవ్వడంతో పాటు ఆయన స్పందన కోసం ఎదురు చూస్తుంటానని ఆమె చెప్పారు.

మరోవైపు సాయిపల్లవి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఫిదాతో సాయిపల్లవికి తెలుగులో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శేఖర్ కమ్ముల మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గి థియేటర్లు ఓపెన్ అయితే లవ్ స్టోరీ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

కేసులు తగ్గిన తర్వాతే ట్రైలర్ ను రిలీజ్ చేయాలని లవ్ స్టోరీ మేకర్స్ భావిస్తున్నారు.

సారంగదరియా పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

మరోవైపు నాగచైతన్య సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.లవ్ స్టోరీ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

#Chaitanya #ActressSai #Saipallavi #ActressSai #Angriness

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు