పవన్ కళ్యాణ్ ను ఫిదా చేసిన సాయిపల్లవి..?  

sai pallavi pair up with pavan kalyan in ayyappanum koshium remake Pawan Kalyan, Ayyapanum Koshiyum, Vakeel Sahebh, Sai Pallavi, Rana, Nithin, Premam, Billa And Ranga - Telugu @sai_pallavi92, Ayyapanum Koshiyum, Billa And Ranga, Nithin, Pawan Kalyan, Premam, Rana, Sai Pallavi, Sai Pallavi Pair Up With Pavan Kalyan In Ayyappanum Koshium Remake, Vakeel Sahebh

మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంతటా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి.ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు నటిగా సాయిపల్లవికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Saipallavi Pair Up Pawan Kalyan In Ayyappanum Koshiyum Remake

కెరీర్ మొదట్లో మలయాళం సినిమాల్లో నటించిన సాయిపల్లవి ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.ఆ సినిమాలో సాయిపల్లవి పోషించిన భానుమతి పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు.

ఫిదా సినిమాకు 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాగా ఆ సినిమా ఆ స్థాయిలో హిట్ కావడానికి ఒక రకంగా సాయిపల్లవే కారణమని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.ఫిదా సినిమా తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచె మనసు సినిమాల్లో నటించిన సాయిపల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తోంది.

TeluguStop.com - పవన్ కళ్యాణ్ ను ఫిదా చేసిన సాయిపల్లవి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే టాలెంటెడ్ నటిగా ప్రూవ్ చేసుకున్నా స్టార్ హీరోల సరసన అవకాశాలు రాని సాయిపల్లవికి పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

దసరా పండుగ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నటించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ సినిమాకి సాయిపల్లవి ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.మెగా ఫ్యామిలీలో ఇప్పటికే వరుణ్ తో కలిసి నటించిన సాయిపల్లవి బాబాయ్ పవన్ కళ్యాణ్ తో జత కడుతుందో లేదో చూడాల్సి ఉంది.

వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత బిల్లా రంగా పేరుతో అయ్యప్పన్ కోషియమ్ షూటింగ్ ప్రారంభం కానుందని.ఈ సినిమాలో మరో పాత్రలో రానా లేదా నితిన్ నటించనున్నారని సమాచారం.

మరో మూడేళ్ల పాటు పవన్ పూర్తి సమయం సినిమాలకే కేటాయించనున్నాడని అందుకే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

#Nithin #Vakeel Sahebh #Rana #Billa And Ranga #@Sai_Pallavi92

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Saipallavi Pair Up Pawan Kalyan In Ayyappanum Koshiyum Remake Related Telugu News,Photos/Pics,Images..