పవన్ కళ్యాణ్ కు ఝలక్ ఇచ్చిన సాయిపల్లవి..ఏం చేసిందంటే?

సాయిపల్లవి ప్రస్తుతం ఎక్కువగా ప్రేక్షకుల డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. ఫిదా సినిమాతో ఒక్కసారిగా కుర్ర కారును మత్తెక్కించిన సాయిపల్లవి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

 Saipallavai Gave A Jhalak To Pawan Kalyan What Did He-TeluguStop.com

అచ్చమైన తెలంగాణ యాసలోమాట్లాడి తన మాటలతో వెండితెర ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిందంటే అతిశయోక్తి కాదు.అందరి హీరోయిన్లతో పోలిస్తే సాయిపల్లవిలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే సాయిపల్లవి స్కిన్ షో కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సాయిపల్లవిలోని నటిని గుర్తించుకునేలా తనదైన ముద్ర వేసింది.

ఇక ఫిదా హిట్ తరువాత ఇక తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ కాల్షీట్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి.

 Saipallavai Gave A Jhalak To Pawan Kalyan What Did He-పవన్ కళ్యాణ్ కు ఝలక్ ఇచ్చిన సాయిపల్లవి..ఏం చేసిందంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏ సినిమాను ఒప్పుకొనే పరిస్థితి లేనంత బిజీగా సాయిపల్లవి ఉంది.

అయితే తాజాగా సాయిపల్లవిపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది.తెలుగులో త్వరలో రానున్న అయ్యప్పనం కోషియన్ రీమేక్ లో సాయిపల్లవి కీలక పాత్రను పోషిస్తున్నది.అయితే ఇక త్వరలో పట్టాలెక్కనున్న సమయంలో మూవీ యూనిట్ కు సాయిపల్లవి ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇక యూనిట్ నుండి తప్పుకుంటున్నానని సాయిపల్లవి కన్ఫర్మ్ చేయడంతో మరో హీరోయిన్ కోసం మూవీ టీమ్ వెతుక్కునే పనిలో పడ్డారు.

అయితే ఈ సినిమాను సాగర్ చంద్ర దర్శకత్వం వహించనుండగా పవన్ కళ్యాణ్, రాణా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావాలని చాలా మంది హీరోయిన్లు కలలు కంటుంటారు.

కాని మరి ఏకంగా పవన సినిమా నుండే తప్పుకుందంటే ఇక మరి మరేదైనా పెద్ద కారణం ఉండొచ్చని అనుకుంటున్నారు.

#APJanasena #@SaipallaviFC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు