చైతూ కూడా అర్జున్‌ రెడ్డి కంటెంట్‌నే నమ్ముకున్నాడా....  

Sailaja Reddy Alludu Following Arjun Reddy Content-

ఈమద్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిత్రాల జోరు తెగ కనిపిస్తున్న విషయం తెల్సిందే.అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100, గీత గోవిందం చిత్రాలతో పాటు త్వరలో రాబోతున్న భైరవ గీత వంటి చిత్రాలు టాలీవుడ్‌ను ముంచెత్తుతున్నాయి.చిన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించడం చాలా కష్టం.సినిమాలో బలమైన కంటెంట్‌ ఉంటే తప్ప సినిమా విజయం సాధించదు..

Sailaja Reddy Alludu Following Arjun Reddy Content--Sailaja Reddy Alludu Following Arjun Content-

సినిమా గురించి జనాల్లో టాక్‌ వచ్చినప్పుడు మాత్రమే ఆ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటాయి.ఎంతగా పబ్లిసిటీ చేసినా కూడా చిన్న చిత్రాలకు మౌత్‌ టాక్‌ కీకం అని ప్రముఖ నిర్మాతలు అంటూ ఉంటారు.

అలాంటి మౌత్‌ టాక్‌ రావాలి అంటే ఖచ్చితంగా ఏదైనా ప్రత్యేకంగా సినిమాలో ఉండాలి.పైన చెప్పిన సినిమాల్లో ముద్దు సీన్స్‌ హద్దులు దాటేసి ఉన్న విషయం తెల్సిందే.

ఆ చిత్రాలు భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకోవడానికి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ముద్దు సీన్స్‌ ప్రధాన కారణం అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ముద్దు సీన్స్‌ విషయంలో నాగచైతన్య కూడా కాంప్రమైజ్‌ అయినట్లుగా తెలుస్తోంది.సినిమాకు క్రేజ్‌ తీసుకు వచ్చేందుకు అను ఎమాన్యూల్‌ లిప్స్‌ను చైతూ అందుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది..

శైలజారెడ్డి అల్లుడు సినిమాకు ఇప్పటికే మంచి పబ్లిసిటీ దక్కింది.అందుకే సినిమా విడుదలకు ముందే ముద్దు సీన్‌ గురించి రివీల్‌ చేయాలని భావించడం లేదు.సినిమా విడుదలయ్యాక ఎలాగూ ప్రేక్షకుల ద్వారా మౌత్‌ టాక్‌తో ఆ విషయం స్ప్రెడ్‌ అవ్వడం ఖాయం.

ముద్దు సీన్‌ వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పొగరుబోతు తల్లి కూతుర్లతో హీరో పడ్డ కష్టాలను ఈ చిత్రంలో దర్శకుడు మారుతి ఫన్నీగా చూపించాడట.

నాగచైతన్య హీరోగా గతంలో వచ్చిన ఏమాయ చేశావే చిత్రంలో ముద్దు సీన్స్‌ చాలానే ఉన్నాయి.ఆ తర్వాత మనం చిత్రంలో సమంతతో మరోసారి కూడా ముద్దు సీన్స్‌ ఉన్నాయి.

సమంతతో తప్పించి మరెవ్వరితో కూడా చైతూ ముద్దు సీన్స్‌ చేయలేదు.మళ్లీ ఇప్పుడు అను ఎమాన్యూల్‌తో ముద్దు సీన్‌ను చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మరి ఈ విషయంపై సినిమా విడుదల అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..