లాస్యకు క్రీమ్ బిస్కెట్ వేసిన సాయి కుమార్.. వైరల్ వీడియో?

ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.బుల్లితెరపై వివిధ ఛానళ్లలో ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.

 Saikumar Cream Biscuit For Lasya-TeluguStop.com

ఇలా ప్రసారమయ్యే వాటిలో సీనియర్ హీరో సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి వావ్కార్యక్రమం ఒకటని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి బుల్లితెర పై ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.M

 Saikumar Cream Biscuit For Lasya-లాస్యకు క్రీమ్ బిస్కెట్ వేసిన సాయి కుమార్.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిలో యాంకర్ లాస్య మంజునాథ్,యాక్టర్ కమ్ సింగర్ అండ్ ర్యాపర్ నోయల్ సేన్, న్యూస్ రీడర్ జోర్దార్ సుజాత, యూట్యూబర్ మెహబాబ్ వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

ఈ సందర్భంగా ఈ నలుగురితో హీరో సాయి కుమార్ ఎంతో సరదాగా ముచ్చటించారు.ఈ సమయంలోనే సాయికుమార్ యాంకర్ లాస్యతో మాట్లాడుతూ.గతంలో ఒకసారి ఈ కార్యక్రమానికి వచ్చావ్ కదా అని అడగడంతో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం వచ్చాను సార్ అంటూ సమాధానం చెబుతుంది.

ఈ మాట విన్న సాయి కుమార్ అప్పుడు అలాగే ఉన్నావు.ఇప్పుడు అలాగే ఉన్నావు.ఇకపై ఎప్పుడు అలాగే ఉంటావేమో అని సాయికుమార్ అనగా అదే కదా కిక్ అంటే అంటూ లాస్య నవ్వుతుంది.

అప్పుడు సాయికుమార్ రాయచోటి.కడప.పవర్ అని అనడంతో లాస్య పొంగిపోతూ ఎంతో సంతోష పడుతుంది.ఈ క్రమంలోనే లాస్య సంతోష పడుతుండగానే మైక్ లో క్రీమ్ బిస్కెట్ అనే వాయిస్ రావడంతో అదివిని లాస్య ఒక్కసారిగా షాక్ అయినప్పటికీ లేదు.

లేదు అంటూ నవ్వుతుంది.ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి గురించి సాయికుమార్ అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన ఈ కంటెస్టెంట్ లు ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఏ విధంగా సందడి చేశారనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

#TV Show #Wow Program #Biscuit #Lasya #Sai Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు