అగ్నిప్రమాదంలో ధ్వంసం అయిన సైఫాబాద్‌ నిజాం క్లబ్‌.. !

అగ్నిప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అసలే కరోనా వల్ల చతికిల బడిన వ్యాపారులకు ఈ అగ్నిప్రమాదాలు మిగుల్చుతున్న నష్టం కోలుకోకుండా చేస్తుందట.

 Saifabad Nizam Club Destroyed In-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్య కాలంలో నగరంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న విషయం గమనించే ఉంటారు.ముఖ్యంగా వ్యాపార సముదాయాల్లో అర్ధరాత్రి సమయాల్లో ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రాణ నష్టం జరగడం లేదు గానీ, ఆస్తి నష్టం మాత్రం సంభవిస్తుంది.

ఇకపోతే తాజాగా నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందట.కాగా ఈ మంటల దాడికి క్లబ్‌లోని రెండవ అంతస్తులో ఉన్న ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమైందని సమాచారం.

 Saifabad Nizam Club Destroyed In-అగ్నిప్రమాదంలో ధ్వంసం అయిన సైఫాబాద్‌ నిజాం క్లబ్‌.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్దలానికి చేరుకుని రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారట.కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయం లో క్లబ్‌లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు అధికారులు.

ఇక ఈ ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం తెలియలేదు.

#Destroyed #Fire #Nizam Club #Saifabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు