యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్( Adipurush )’ చిత్రం ఎట్టకేలకు రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని అంచనాల నడుమ, అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం పై ఏర్పడిన భారీ అంచనాల వల్లో ఏమో తెలియదు కానీ, మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.
ఫస్ట్ హాఫ్ చాలా చక్కగా తీశారు అనే టాక్ వచ్చినా, సెకండ్ హాఫ్ మాత్రం చాలా చెత్తగా తీశారు, రామాయణం ని ఎగతాళి చేసినట్టు గా సినిమా ఉందని, ముఖ్యంగా రావణాసురిడి తలలు గురించి పురాణాల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని విధంగా డైరెక్టర్ కి ఇష్టమొచ్చినట్టు చూపించిన విధానం ఎవరికీ నచ్చలేదని,రామాయణం ని ఇంత చెత్తగా ఎవ్వరూ చూపించలేదంటూ క్రిటిక్స్ మూవీ టీం పై తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ చేసింది.ముఖ్యంగా రావణాసురిడి పది తలలను చూపించిన విధానం పైనే ఎక్కువగా మండిపడుతున్నారు.
ముందుగా టీజర్ విడుదల చేసినప్పుడు రావణాసురిడి పదితలలు ఒకేవరుసలో ఉండడం మనం గమనించొచ్చు.కానీ గ్రాఫిక్స్ రీ వర్క్ చేసిన తర్వాత రెండు వరుసలుగా రావణాసురిడి తలలను చూపించారు.ట్రైలర్స్ లో కూడా రావణాసురుడిని ఎందుకు ఎక్కువగా చూపించకుండా మూవీ టీం దాచిపెట్టింది అని అప్పట్లో అభిమానులకు సందేహం కలిగింది.ఆ సందేహాలకు సమాధానమే ఇప్పుడు విడుదలైన ఈ సినిమా, ముందుగా ట్రైలర్ లో చూపిస్తే ఎక్కడ మూవీ పై మరోసారి నెగటివ్ రిమార్క్స్ వస్తుందేమో అని బయపడి, ఇలా చేసినట్టుగా చెప్తున్నారు విశ్లేషకులు.
అయితే రావణాసురిడిగా చేసిన సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ), విడుదలకు ముందు మూవీ ఔట్పుట్ చూసి డైరెక్టర్ ఓం రౌత్ పై ఫైర్ అయ్యాడట.నీ ఇష్టమొచ్చినట్టు రామాయణం ని తీస్తావా, రావణాసురిడి పది తలలు ఇలా ఉంటాయంటే జనాలు తీసుకుంటారు అనుకుంటున్నావా, నన్ను అడగకుండా ఇలా ఎందుకు చేసావు అంటూ ఓం రౌత్ తో గొడవలు పెట్టుకున్నాడట.
దాంతో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాకి నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు, ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా నేను హాజరు కాను అని నిర్మొహమాటంగా ప్రభాస్ కి మరియు ఓం రౌత్ కి చెప్పాడట.అందుకే ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ నుండి డైరెక్టర్ వరకు ఎవ్వరూ కూడా రావణాసురిడి పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.రావణాసురుడు లేకపోతే రామాయణమే లేదు, అంత ముఖ్యమైన పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ గురించి మూవీ టీం ఒక్కరు కూడా మాట్లాడకపోవడం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది.అయితే మూవీ ఔట్పుట్ చూసినప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి ఎలాంటి అనుభూతి కలిగిందో, ఆడియన్స్ కి క్రిటిక్స్ కి కూడా అలాంటి అనుభూతి కలిగింది.