ఈ హీరోకు రూ.5 వేల కోట్ల ఆస్తులున్నాయట.. పిల్లలకు మాత్రం చిల్లిగవ్వ ఇవ్వలేడు!

భారతీయ నటుడిగా, నిర్మాతగా సైఫ్ అలీ ఖాన్ ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.మొదట అమృతా సింగ్ ను వివాహం చేసుకున్న సైఫ్ అలీ ఖాన్ 2004 సంవత్సరంలో ఆమెతో విడాకులు తీసుకున్నారు.

 Saif Ali Khan Wont Able To Give A Rupee From His 5000 Crore Rupees Property To His Sons-TeluguStop.com

ఆ తరువాత సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నారు.ఈ స్టార్ హీరో ఆస్తుల విలువ ఏకంగా 500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

అయితే అన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఈ హీరో పిల్లలకు మాత్రం డబ్బులు ఇవ్వలేడు.

 Saif Ali Khan Wont Able To Give A Rupee From His 5000 Crore Rupees Property To His Sons-ఈ హీరోకు రూ.5 వేల కోట్ల ఆస్తులున్నాయట.. పిల్లలకు మాత్రం చిల్లిగవ్వ ఇవ్వలేడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ స్టార్ హీరో పిల్లలు జహంగీర్ అలీఖాన్, సారా అలీఖాన్, తైమూర్ అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ కాగా సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ దేశంలో సంపన్న కుటుంబాలలో ఒకటని చెప్పవచ్చు.

సైఫ్ అలీఖాన్ రాజవంశానికి చెందిన వ్యక్తి కాగా సైఫ్ అలీఖాన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ కుమారుడు కావడం గమనార్హం.అయితే సైఫ్ అలీఖాన్ తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తులన్నీ భారత ప్రభుత్వం యొక్క వివాదాస్పద ఎనిమీ డిస్ ప్యూట్స్ యాక్ట్ కిందకు వస్తాయని సమాచారం.

అందువల్ల ఈ ఆస్తులను చట్టపరంగా సైఫ్ అలీఖాన్ లేదా అతని వారసులు క్లెయిమ్ చేయడం సాధ్యపడదు.

Telugu 5000 Crores Property, Amritha Singh, His Sons, Ibrahim, Janagir, Kareena Kapoor, Netizens Opinion, Saif Ali Khan, Saif Ali Khan Properties, Saif Assets Disputes, Saif Family, Sara Ali Khan, Taimoor-Movie

సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విషయంలో చాలా గందరగోళం నెలకొనడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది.సైఫ్ అలీ ఖాన్ ముత్తాత హమీదుల్లా ఖాన్ తన ఆస్తులకు సంబంధించి ఎటువంటి వీలునామా రాయలేదు.సైఫ్ అలీఖాన్ తాతయ్య సోదరి వారసుల వల్ల ఈ ఆస్తులకు సంబంధించిన వివాదం తలెత్తిందని సమాచారం.

Telugu 5000 Crores Property, Amritha Singh, His Sons, Ibrahim, Janagir, Kareena Kapoor, Netizens Opinion, Saif Ali Khan, Saif Ali Khan Properties, Saif Assets Disputes, Saif Family, Sara Ali Khan, Taimoor-Movie

సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య పిల్లలకు, రెండో భార్య పిల్లలకు ఆస్తులను బదిలీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.సైఫ్ అలీ ఖాన్ పరిస్థితిని చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.సైఫ్ లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

#Saif Khan #Sara Ali Khan #Janagir #Saif Khan #Saif Assets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube