లంకేష్ లుక్‌తోనే భయపెడతానంటోన్న సైఫ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం యావత్ ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

 Saif Ali Khan Look In Adipurush, Saif Ali Khan, Adipurush, Prabhas, Om Raut, Rav-TeluguStop.com

బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు.

ఇక రామాయణం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కిస్తు్న్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

కాగా ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ఈ సినిమాలో రావణుడిగా ‘లంకేష్’ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో ఆయన లుక్స్ పరంగా చాలా భయంకరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.రావణుడికి గుర్తుగా నుదుటిపై నల్లటి తిలకంతో సైఫ్ అలీ ఖాన్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి ఆదిపురుష్ చిత్రంలో కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా ఇతర తారాగణంతో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఏ రకంగా ఉండబోతుందా అనే ఆతృత ఇటు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా నెలకొంది.

కాగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సానన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.మరి ఈ సినిమాతో ప్రభాస్ ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో ఆదిపురుష్ చిత్రంలో ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube