ఇలా వచ్చి అలా వెళ్లినందుకు కోటిన్నర....  

ప్రస్తుతం సెలబ్రిటీలు ఏం చేసినా దానికి తగ్గట్టుగానే పారితోషికాన్ని ఆర్జిస్తుంటారు.అయితే సాధారణంగా కొంత మంది సెలబ్రిటీలు వారితో పాటు అలాగే వారి వారసులను కూడా అదే బాటలో అభివృద్ధి చెందే విధంగా నడిపిస్తుంటారు.

TeluguStop.com - Saif Ali Khan Kareena Kapoor Three Hours Event

తాజాగా బాలీవుడ్లో ఓ సెలబ్రిటీ దంపతులు మరియు వారి కుమారుడితో కలిసి ఇ ఓ బేబీ ప్రొడక్ట్ లాంచింగ్  ఈవెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే ఇందుకుగాను వారు సుమారుగా కోటిన్నర వరకు పారితోషికం తీసుకున్నారు.అయితే వాళ్లు ఎవరో కాదు సైఫ్ అలీ ఖాన్ మరియు అతని భార్య కరీనా కపూర్.

అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ మరియు అతని భార్య కరీనా కపూర్ వారి కొడుకు తైమూర్ అలీ ఖాన్ బేబీ ఉత్పత్తులకు సంబందించిన ఓ కంపెనీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరయ్యారు.అయితే ఇందులో భాగంగా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ల కొడుకు  తైమూర్ అలీ ఖాన్ చేతుల  మీదుగా తమ సంస్థలకు చెందినటువంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు.

  అయితే దీనికిగాను ఈ సంస్థ ప్రతినిధులు సైఫ్ దంపతులకు దాదాపుగా కోటిన్నర రూపాయలు సమర్పించుకున్నారు.అయితే ఈ కార్యక్రమం మూడు గంటలసేపు మాత్రమే జరిగింది.కేవలం మూడు గంటలకి గానూ గంటకి 50 లక్షజాలా రూపాయలు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో సైఫ్ అలీ ఖాన్ కొడుకు తైమూర్ అలీ ఖాన్ వాటాగా దాదాపుగా 75 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఈ సంస్థ విడుదల చేసినటువంటి ఉత్పత్తులన్నీ చిన్న పిల్లలకు సంబంధించినవి గా ఉన్నందున మరియు తైమూర్ అలీ ఖాన్ కి ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్ కి గాను కంపెనీ ప్రతినిధులు భారీ పారితోషికానికి ఇచ్చినట్లు తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ సెలబ్రిటీలకు మాత్రం ఏం చేసినా కూడా డా డబ్బులు కుప్పలుగా వచ్చి పడతాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ కూతురు కూడా  సారా అలీ ఖాన్ కూడా సినిమాల్లో బాగానే రాణిస్తోంది.

#TaimurAli #TaimurAli #SaifAli #SaifAli #Kareena Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు