అప్పుడు నన్ను అమ్మ చూసి గుర్తు పట్టలేక పోయింది.. నేను సాధించిన విజయం అది

బాలీవుడ్‌ స్టార్‌ హీరోల వారసులు ఎంట్రీ ఇవ్వడం పెద్ద విశేషం ఏమీ కాదు.హీరోల కూతుర్లు కూడా హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

 Saif Ali Khan Daughter In Movies-TeluguStop.com

అదే దారిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా నటిగా మాత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

స్టార్‌ హీరో కూతురు అవ్వడంతో హిందీ సినీ ప్రముఖుల నుండి వరుసగా ఆమెకు ఆఫర్లు వెళ్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం ఆమె చేస్తున్న పలు సినిమాలు ఆన్‌ సెట్స్‌ ఉన్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్‌ చేసుకుంది.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు తన ఫిజిక్‌ గురించి షాకింగ్‌ విషయాలు చెప్పుకొచ్చింది.తాను అమెరికాలో చదువుకునేందుకు వెళ్లాను.అక్కడ తిండి అలవాట్లు బాగా మారిపోయాయి.చిన్నప్పటి నుండే లావుగా ఉండే నేను, అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడి ఫుడ్‌తో మరింతగా లావు అయ్యాను.ఒకానొక దశలో 95కు పైగా కేజీల బరువుతో లావుగా మారిపోయాను.

ఆ సమయంలోనే నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని అమ్మతో చెప్పాను.

నీ లావుకు సినిమాల్లో ఎలా చేస్తావు అంటూ అమ్మ నవ్వేసింది.నువ్వు మొదట బరువు తగ్గు ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచిద్దువు గాని అంది.దాంతో నేను లావు తగ్గాలని బలంగా నిర్ణయించుకుని అందుకోసం కఠిన ఆహార నియమాలను పాటించి సంవత్సరంలో దాదాపుగా 40 కేజీల బరువు తగ్గాను.

బరువు తగ్గిన తర్వాత ముంబయి వచ్చిన సమయంలో అమ్మ నన్ను గుర్తు పట్టలేక పోయింది.

నా చేతిలో ఉన్న బ్యాగ్‌ ను చూసి అప్పుడు నన్ను గుర్తు పట్టింది.ఆ సమయంలో నేను విజయాన్ని సొంతం చేసుకున్నంత సంతోషం కలిగిందని సారా అలీ ఖాన్‌ చెప్పుకొచ్చింది.బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఎంతో మంది కూడా లావుగా ఉండేవారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సన్నగా అయ్యారు.సోనాక్షి సిన్హా ఏకంగా క్వింట బరువు ఉండేది.

ఆమె సినిమాల కోసం 60కి తగ్గింది.ఇంకా ఎందరో…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube