వరుణ్ తో రొమాన్స్ కి రెడీ అయిన దబాంగ్ 3 బ్యూటీ  

Saiee Manjrekar To Romance With Varun Tej - Telugu Bollywood, Romance With Varun Tej, Saiee Manjrekar, South Cinema, Tollywood

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు.వరుస హిట్స్ తో మంచి లైన్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ బాక్సర్ అవతారం ఎత్తాడు.

Saiee Manjrekar To Romance With Varun Tej - Telugu Bollywood South Cinema Tollywood

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపధ్యంలో సాగే సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు.దీని కోసం ఇప్పటికే బాక్సింగ్ లో శిక్షణ తీసుకొని షూటింగ్ కి రెడీ అయిపోయాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖలో మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.మరో వైపు దర్శకుడు కాస్టింగ్ సెలక్షన్ పైన కూడా దృష్టి పెట్టాడు.

ఈ నేపధ్యంలో ఈ సినిమాలో వరుణ్ తో రొమాన్స్ కోసం బాలీవుడ్ భామని రంగంలోకి దించుతున్నాడు.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జోడీగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన దబాంగ్ 3 సినిమాలో నటించిన సయి మంజ్రేకర్ ని వరుణ్ హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

బాలీవుడ్ దర్శకుడు, స్టార్ యాక్టర్ అయిన మహేష్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ అనే విషయం అందరికి తెలిసిందే.బాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేసే అలవాటు ఉన్న సల్మాన్ ఖాన్ ఈ భామకి కూడా లైఫ్ ఇచ్చాడు.

ఈ సినిమాలో సింపిల్ లుక్ లో ఆకట్టుకున్న ఈ భామకి సౌత్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.అందులో భాగంగానే వరుణ్ కోసం ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే ఇంది ఎంత వరకు వాస్తవం అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు