మహేష్ కి జోడీగా తెరపైకి ఆ బాలీవుడ్ భామ పేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చి విపరీతంగా ట్రెండ్ అయ్యింది.

 Saiee Manjrekar Can Get Chance In Mahesh Film, Telugu Cinema, Mahesh Babu, Paras-TeluguStop.com

ఇక సెలబ్రిటీలు సైతం ఈ సినిమా టైటిల్ పై ప్రశంసలు కురిపించారు.మహేష్ లో ఎన్నడూ చూడని మాస్ యాంగిల్ లో ఈ సినిమాలో పరశురాం చూపించబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అనే మాట కూడా వినిపిస్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా భరత్ అనే నేనులో మహేష్ తో ఆడిపాడిన కైరా అద్వానీని ఫైనల్ చేసారని టాక్ వినిపించింది.

ఇప్పడు కియారా ప్లేస్ లో మరో పేరు వినిపిస్తోంది.బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందన్నది టాలీవుడ్ వర్గాల భోగట్టా.

ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిని సంప్రదించిందని, ఆమె ఒప్పుకుందని కూడా తెలుస్తోంది.ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి సినిమాలో కూడా ఇప్పటికే హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రం ద్వారా ఈ భామ తెరంగేట్రం చేసింది.

మొత్తానికి తెలుగులో మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా అవకాశం కొట్టేసింది అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube