మెగా హీరోలను లైన్‌లో పెట్టిన బ్యూటీ.. ఎవరంటే?

బాలీవుడ్ భామలకు టాలీవుడ్‌లో ఒక్క హిట్ సినిమా పడితే ఇక వారి పంట పండినట్లే.వారికి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చి పడుతుంటాయి.

 Saiee Manjrekar In Allu Arjun Pawan Kalyan Movies, Saiee Manjrekar, Allu Arjun,-TeluguStop.com

అయితే కొందరికి మాత్రం ఎంత ప్రయత్నించినా సినిమా ఆఫర్లు వరుసగా రావు.కానీ బాలీవుడ్‌కు చెందిన ఓ బ్యూటీ ఇంకా టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా పూర్తి చేయకముందే వరుసబెట్టి ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

ఆమె మరెవరో కాదు, దబాంగ్ 3 చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన సాయీ మంజ్రేకర్.

అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో అడవి శేష్ నటిస్తున్న మేజర్ చిత్రంలో నటిస్తోంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సాయీ మంజ్రేకర్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న బాక్సర్ చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది.అయితే ఈ సినిమాలతో పాటు మరో ఇద్దరు మెగా హీరోల సరసన హీరోయిన్‌గా సాయీ మంజ్రేకర్ ఎంపికయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కూడా ఈ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారు.

అంతేగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో నటించబోయే సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో ఈ బ్యూటీ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ఇలా వరుసబెట్టి మెగా హీరోల ఆఫర్లు వస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు.అయితే అమ్మడు తొలి సినిమా రిలీజ్ అయ్యాక, ఆ సినిమా రిజల్ట్‌ను బట్టే తరువాత సినిమాల ఛాన్సులు ఉంటాయని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

మరి ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్‌లో ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube