రైల్వే ట్రాక్ పై సైదాబాద్ నిందితుడు రాజు డెడ్ బాడీ లభ్యం..!!

సైదాబాద్ లో చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడు రాజు డెడ్ బాడీ ఘట్ కేసరి రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు గుర్తించినట్లు.మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 Saidabad Accused Raju Dead Body Found On Railway Track-TeluguStop.com

ఆరేళ్ల చిన్నారిని అత్యంత క్రూరంగా దారుణంగా 30 సంవత్సరాల వయసు కలిగిన రాజు అత్యాచారం చేయడం.తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు అదేరీతిలో సెలబ్రిటీలు ఈ విషయంపై ఘాటు గా రియాక్ట్ కావడంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరగటంతో నిందితుడు రాజుని పట్టుకోవడం కోసం పోలీసులుబృందాలుగా విడిపోయి గత కొన్ని రోజుల నుండి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 Saidabad Accused Raju Dead Body Found On Railway Track-రైల్వే ట్రాక్ పై సైదాబాద్ నిందితుడు రాజు డెడ్ బాడీ లభ్యం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే తరుణంలో నిందితుడు రాజు ఫోటో ని రిలీజ్ చేసి పట్టిస్తే పది లక్షల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది.

నిన్న రాత్రి పోలీసులు ఈరోజు ఉదయం కల్లా రాజుని పట్టుకుంటామని ప్రకటించారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నిందితుడు రాజు ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద.

బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు.రైల్వే ట్రాక్ మృతదేహం చేతిపై మౌనిక అనే టాటూ  ఉండటంతో అది రాజు చెయ్యి అని తేలడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.

#Saidabad #Press #Railway Track #Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు