పవన్ బాటలోనే సాయి తేజ్.. ఫారిన్ అమ్మాయితో ప్రేమ, పెళ్లి?

Sai Tej On The Way To Pawan Love And Marriage With A Foreign Girl

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Sai Tej On The Way To Pawan Love And Marriage With A Foreign Girl-TeluguStop.com

అంతేకాకుండా అతి తక్కువ సమయంలో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా తన మేనమామ బాటలో నడుస్తున్నట్లు తెలుస్తుంది.

2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందించింది.

 Sai Tej On The Way To Pawan Love And Marriage With A Foreign Girl-పవన్ బాటలోనే సాయి తేజ్.. ఫారిన్ అమ్మాయితో ప్రేమ, పెళ్లి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా గుర్తింపు కూడా అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

కొంతవరకు మంచి సక్సెస్ అందుకున్న మరికొన్ని సినిమాలు నిరాశపరిచాయి.

ఇక దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ లో దాదాపు నెలకు పైగా హాస్పిటల్ లో ఉండి చికిత్స అందుకని ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తన ఇంటికి చేరుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి ముందు సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.కానీ అదే సమయంలో ప్రమాదం జరగడంతో అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు.

ఇక మళ్లీ సాయి ధరమ్ తేజ్ కోలుకోవడంతో మళ్లీ తన పెళ్లి గురించి హాట్ టాపిక్ గా మారింది.పైగా తాను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి కూడా తెలియడంతో అందరూ ఈ విషయం గురించి బాగా చర్చలు చేసుకుంటున్నారు.

సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో కాదు తనతో పాటు తిక్క సినిమాలో నటించిన బ్రెజిలియన్ హీరోయిన్, మోడల్ లారిస్సా బోనేసి.ఈ సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.ఇక ఈ బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు లారిస్సా పెడుతున్న ట్వీట్ ల వల్ల అర్థమవుతుంది.గతంలో ఆమె చేసిన ట్వీట్లు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల సమయంలో లారిస్సా సోషల్ మీడియా వేదికగా.నా తేజు నటించిన రిపబ్లిక్ సినిమా ఈ రోజు విడుదల అవుతుంది అంటూ లవ్ సింబల్ తో పోస్ట్ చేసింది.ఇక ఇటీవలే ఐ యామ్ ఇన్ లవ్ అంటూ మరో పోస్ట్ షేర్ చేయగా నెటిజనులంతా వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అనుకున్నారు.ఇక త్వరలోనే వీరు కూడా వివాహ బంధంతో ఒకటవుతారు అని కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ లాగుతున్నారు.ఎందుకంటే పవన్ మూడో భార్య కూడా ఫారిన్ కి చెందిన అమ్మాయి కావడంతో సాయి ధరమ్ తేజ్ కూడా తన మామ బాటలో నడుస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాలంటే సాయి ధరమ్ తేజ్ నోటినుండే తెలుసుకోవాలి.

#Pawan Kalyan #Sai Dharma Tej #Brazil #Eign #Larissa Bonesi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube