కథ వినకుండానే రిపబ్లిక్ మూవీ చేస్తున్న సాయి ధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సాయి తేజ్.మొదటి సినిమా ఫ్లాప్ అయిన తరువాత ఏకంగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి ఊపులోకి వచ్చాడు.

 Sai Tej Didn't Listen Republic Story, Tollywood, Deva Katta, Sukumar, Mega Hero,-TeluguStop.com

మళ్ళీ కథల ఎంపికలో గాడి తప్పడంతో డబల్ హ్యాట్రిక్ ఫ్లాప్ లని ఖాతాలో వేసుకున్నాడు.అయితే మళ్ళీ చిత్రలహరి సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు.

చివరిగా సోలో బ్రతుకే సొ బెటరు సినిమాతో సాయి తేజ్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.లాక్ డౌన్ తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ఫస్ట్ థియేటర్ మూవీ ఇదే కావడం విశేషం.

ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రాకున్న నిర్మాతని మాత్రం సేఫ్ జోన్ లో పడేసింది.ఇదిలా ఉంటే ఇప్పుడు దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ రిపబ్లిక్ అనే పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.

టాలీవుడ్ లో పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ కాన్సెప్ట్ లకి మంచి క్రేజ్ ఉంది.ఈ నేపధ్యంలో ప్రస్తానం లాంటి పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకులని మెప్పించిన దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో మంచి పాజిటివ్ టాక్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.స్టూడెంట్ లీడర్ ప్రెజెంట్ పొలిటికల్ సిస్టమ్ మీద ఎందుకు తిరగబడ్డాడు.రాజకీయ నాయకులతో ఎలాంటి పోరాటం చేసాడు అనే అంశాలని సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఇందులో రమ్యకృష్ణ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ దేవకట్టా ఈ సినిమా కథ ముందుగా చెబుతానంటే వద్దని చెప్పా.మంచి దర్శకుడు చెప్పే కథని సినిమా రూపంలో తెరపైనే చూడాలనే ఉద్దేశ్యంతో కథ వినలేదని క్లారిటీ ఇచ్చాడు.

దేవకట్టా మంచి విషయం ఉన్న దర్శకుడే ప్రస్థానం తర్వాత ఆయన సినీ ప్రయాణంలో ఫ్లాప్ లే ఎక్కువ.మరి అలాంటి దర్శకుడుని నమ్మి కథ కూడా వినకుండా సాయి తేజ్ సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube