అభిమాన హీరోతో నటించనున్న సాయిపల్లవి.! ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?       2018-06-07   02:55:11  IST  Raghu V

సాయి పల్లవి ప్రస్తుతం ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ప్రస్తుతం ఆమె తెలుగులో,తమిళం లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఇక ఆమె కు మలయాళం లో ప్రేమం సినిమాతో క్రేజ్ ఒక రేంజ్ లో వస్తే ఇక్కడ ఫిదా సినిమా తో ఆ క్రేజ్ ఇక్కడ కూడా వచ్చింది.

-

తాజాగా ఆమె ఆటో నేర్చుకుంటోందనే రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ బ్యూటీ తన అభిమాన హీరో సూర్యతో జతకట్టనున్నారు.అంతేకాక కోలీవుడ్‌లో మొదటి సినిమా ‘దియా’ కాస్తా నిరాశ పరిచింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దియా తెలుగులోనూ సక్సెస్‌ కాలేదు. కానీ తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కోలీవుడ్‌లో మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అందులో ఒకటి తన అభిమనా హీరో సూర్యతో నటిస్తోంది. ‘ఎన్‌జీకే’ పేరుతో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం దీపావళికి తెరపైకి వచ్చే అవకాశం ఉంది

-

ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో నటిస్తోంది. అయితే మలయాళం, తెలుగులో మాదిరిగా తన మ్యాజిక్‌ కంటిన్యూ కాలేదు. ఆరంభంలోనే మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సాయిపల్లవి ధనుష్‌కు జంటగా ‘మారి-2’లో నటించనుంది. ఇందులో సాయిపల్లవి ఆటో డ్రైవర్‌ పాత్రలో నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ అమ్మడిప్పుడు ఆటో నేర్చుకోవటంలో శిక్షణ పొందుంతోందని సమాచారం. ‘ఫిదా’ చిత్రంలో ఈ బ్యూటీ ట్రాక్టర్‌ నడిపిన విషయం తెలిసిందే. బాలాజీమోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.