అలాంటి సినిమా కావాలంటోన్న సాయి పల్లవి

ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.వరుసగా సాయి పల్లవి చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలవడంతో ఆమెను తమ సినిమాలో నటింపజేయాలని స్టార్ హీరోలు సైతం పోటీ పడ్డారు.

 Sai Pallavi Waiting For A Dance Movie, Sai Pallavi, Fidaa, Love Story, Virata Pa-TeluguStop.com

కానీ తెలుగుతో పాటు అమ్మడు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తుండటంతో తెలుగులో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.

కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో లవ్‌స్టోరి చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ, వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చిత్రంలోనూ నటిస్తోంది.

ఈ రెండు సినిమాల్లో అమ్మడి పాత్ర చాలా వైవిధ్యంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.అయితే సాయి పల్లవికి మాత్రం ఎప్పటినుండో ఓ జోనర్‌కు చెందిన సినిమా చేయాలని ఎదురుచూస్తోంది.

తనకు ప్రాణమైన డ్యాన్స్‌ను బేస్ చేసుకుని ఓ సినిమా చేయాలనేది ఆమె చిరకాల కోరికగా చెబుతోంది.

పూర్తిగా డ్యాన్స్ సబ్జెక్టుతో ఓ సినిమా చేయాలని, అందులో ఆమె లీడ్ రోల్‌లో నటించాలనేది ఆమె కోరిక అని అంటోంది.

మరి సాయి పల్లవికి ఇలాంటి సినిమా ఎప్పుడు పడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న సాయి పల్లవి ఇప్పటికే తాను నటించే సినిమాల్లో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.

కాగా ఈ బ్యూటీ లవ్‌స్టోరి, విరాట పర్వం చిత్రాలతో అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube