ఈ ఇద్దరి హీరోయిన్స్ పుట్టిన గడ్డ రహస్యం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే !

సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్నంత మాత్రాన బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే కానక్కర్లేదు.అట్టడుగు స్థానంలో ఉన్నా కూడా వారిని కూడా టాలెంట్ ఉన్నవారు పైకి వస్తూనే ఉంటారు.

 Sai Pallavi Vs Rashmika From Birth Place Rashmik, Sai Pallavi, Birth Place, Toll-TeluguStop.com

అలా ఎక్కడో మారుమూల పుట్టి పెరిగిన వారు, వారి ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు.కానీ ఇక్కడ మనం ఒక ఇద్దరు హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

వారు మరెవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న రష్మిక, సాయి పల్లవి.వీరి పుట్టిన ప్రాంతానికి, చేస్తున్న పనులు కానీ, నటిస్తున్న నటన కానీ, బ్రతుకుతున్న జీవితం కాని, అన్ని పొంతన లేనివే.

కానీ ఒక చిత్రమైన పోలిక ఈ ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఉంది.అదేంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రష్మిక మందన్న

రష్మిక ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ ఏకకాలంలో చాలా బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది ఆమె ఏ భాషలో నటించినా సరే ఆ భాషకు సంబంధించిన భాషపై ట్రైనింగ్ పోర్షన్ కచ్చితంగా పూర్తిచేస్తుంది.ప్రతిరోజు ఆ భాష పై పట్టు కోసం గంట సేపు సమయం కేటాయిస్తుందట.

రష్మిక కొడవ జాతికి సంబంధించిన అమ్మాయి.కానీ ఆమె తెలుగు, కన్నడ, హిందీ, తమిళం అనర్గంగా మాట్లాడగలుగుతుంది.

కానీ తాను పుట్టిన కొడవ జాతి గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువగానే తెలుసు.ఈ కొడవ జాతి గురించి పెద్ద చరిత్ర ఉంది.

హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఏకంగా 31 సార్లు ఈ జాతి ఓడించింది.అందుకే ఈ జాతి పై కుట్ర పన్ని వీరిని ఊచకోత కోశారు .అందులో మిగిలిన కొందరు అడవుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు.వారు ఆయుధాన్ని తమ దేవుడిగా కొలుస్తారు.

వీళ్ళ కల్చర్ చాలా విచిత్రంగా ఉంటుంది గూర్కాలు సిక్కులు మాత్రమే లైసెన్స్ లేకుండా అనుమతి ఉన్నవారు.వీరి లాగానే కొడవ జాతికి కూడా ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు వీరి జాతిలో జనరల్స్, కల్నల్న్స్, బ్రిగెడియర్స్, లెఫ్టనెంట్ కల్నల్స్ ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే వారి దంతా కూడా మిలట్రీ సైన్యం పుట్టిన నేల .సైన్యం అనగానే అందరికీ కేవలం సిక్కులు ఉత్తరకాండ ప్రజలు లేదంటే గూర్కాలే గుర్తొస్తారు కానీ ఆయుధాన్ని దేవుడుగా, జన్మ హక్కుగా, వారి గర్వంగా, గౌరవం గా, ఆచారంగా భావించేది ఒక్క కొడవ జాతి మాత్రమే.ఇలాంటి జాతిలో పుట్టిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో, బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది

సాయి పల్లవి

Telugu Place, Gargi, Pushpa, Rashmika, Sai Pallavi, Tollywood, Virata Parvam-Lat

పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో బాగానే డిమాండ్ ఉన్న నటి.కానీ ఇటీవల కాలంలో రెండు వరుస పరాయజాయాలతో కాస్త డీలా పడిన, పూర్తిగా కంటెంట్ ఉన్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ నెంబర్ వన్ స్థానానికి వచ్చింది సాయి పల్లవి.ఈమె కూడా చాలా తక్కువ జనాభా కలిగిన బడగజాతికి సంబంధించిన అమ్మాయి.

రష్మిక కోడవ జాతి లాగానే, బడగ జాతికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది.వీరు కూడా అడవుల్లోకి వెళ్లి తలదాచుకున్న తలదాచుకున్నారు.మైసూర్ ముస్లిం పాలకుల హింసకు గురై అడవుల్లోకి పారిపోయింది బడగజాతి.అలా ఒక అట్టడుగు జాతిలో పుట్టిన సాయి పల్లవి నేడు టాలీవుడ్ ని, కోలీవుడ్ ని, సౌత్ ఇండియా ని అని ఒక ఊపు ఊపుతుంది.

జాతులపరంగా చూస్తే సాయి పల్లవి రష్మిక ఇద్దరూ కొడవ, బడగజాతులైనప్పటికీ పోలిక మాత్రం ఒకేలా ఉంటుంది.ఈ రెండు జాతులు కూడా అడవుల్లోకి పారిపోయాయి, అలాగే ఆయుధాన్ని మాత్రమే పట్టుకుని జీవించారు.

తొలినాల్లలో ఎస్టీ కింద ఉండి ప్రస్తుతం బీసీ లోకి మారాయి ఈ జాతులు.అయితే సాయి పల్లవి ఎక్స్పోజింగ్ విషయంలో ఆమడ దూరం ఉంటే, రష్మిక మాత్రం ఆల్వేస్ ఓపెన్ అంటుంది.

లిమిటేషన్స్ పెట్టుకుని సౌత్ ఇండియా కే పరిమితమైతే సాయి పల్లవి రష్మిక మాత్రం లిమిటేషన్స్ లేకుండా కమర్షియల్ హీరోయిన్ గా ఇండియా లెవెల్ లో స్టార్ట్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube