టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్‌స్టోరి’ ఇప్పటికే మెజారిటీ షూటంగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.
కాగా ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోండగా, ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం ఆమె కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా కొరియోగ్రాఫర్‌గా కూడా కనిపిస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ పాటను రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ క్రమంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ పాటను కంపోజ్ చేయాల్సిందిగా సాయి పల్లవిని కోరగా, ఆమె కూడా వెంటనే ఓకే అనేసిందట.
దీంతో ఈ సినిమా కోసం సాయి పల్లవి ఎలాంటి డ్యాన్స్ కంపోజ్ చేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, మరోసారి ఫిదా తరహా గుర్తింపును తెచ్చుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నాడు.