లవ్‌స్టోరి కోసం భానుమతి ఏం చేస్తుందో తెలుసా?  

Sai Pallavi To Choreograph Song In Love Story, Sai Pallavi, Love Story, Sekhar Kammula, Naga Chaitanya - Telugu Love Story, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్‌స్టోరి’ ఇప్పటికే మెజారిటీ షూటంగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.

 Sai Pallavi To Choreograph Song In Love Story

కాగా ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోండగా, ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం ఆమె కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా కొరియోగ్రాఫర్‌గా కూడా కనిపిస్తుందని తెలుస్తోంది.

లవ్‌స్టోరి కోసం భానుమతి ఏం చేస్తుందో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో ఓ పాటను రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ క్రమంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ పాటను కంపోజ్ చేయాల్సిందిగా సాయి పల్లవిని కోరగా, ఆమె కూడా వెంటనే ఓకే అనేసిందట.

దీంతో ఈ సినిమా కోసం సాయి పల్లవి ఎలాంటి డ్యాన్స్ కంపోజ్ చేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, మరోసారి ఫిదా తరహా గుర్తింపును తెచ్చుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నాడు.

#Love Story #Sai Pallavi #Sekhar Kammula #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi To Choreograph Song In Love Story Related Telugu News,Photos/Pics,Images..