ఎట్టకేలకు పవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ  

టాలీవుడ్‌లో రాబోతున్న మల్టీస్టారర్ చిత్రాల్లో ఎప్పటినుండో వార్తల్లో ఉన్న చిత్రంగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యపన్నుమ్ కొషియమ్’ రీమేక్ నిలిచింది.దీనికి కారణం ఈ సినిమా తెలుగు రీమేక్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండటమే.

TeluguStop.com - Sai Pallavi Signed Pawan Kalyan Movie

పవర్ స్టార్ ఓ రీమేక్ కథ, మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడనగానే యావత్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు.ఇక ఈ సినిమాను ఇటీవల అఫీషియల్‌గా ప్రారంభించడంతో ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు ఖచ్చితంగా ఫాలో అవుతూ వస్తున్నారు.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

TeluguStop.com - ఎట్టకేలకు పవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవి నటిస్తుందంటూ గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి.

అయితే తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందనే వార్తలు కూడా వినిపించాయి.తాజాగా ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, తన పాత్ర ప్రాముఖ్యతను దర్శకుడు సాగర్ చంద్ర పెంచడంతో ఈ సినిమాను చేసేందుకు ఆమె రెడీ అయ్యిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నేచురల్ యాక్టింగ్‌కు కేరాఫ్ అయిన సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుందంటే, ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇక ఈ సినిమాలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌న ప్రారంభించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.మరి సాయి పల్లవి ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందో, ఆమె నటన ఈ సినిమాకు ఎంత బలాన్ని ఇస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Pawan Kalyan #Rana Daggubati #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు