సాయిప‌ల్ల‌వి కోసం తెగించిన సురేష్‌బాబు       2018-05-19   01:27:30  IST  Raghu V

సునీల్ నారంగ్.. దగ్గుబాటి సురేష్ బాబు ఓ సినిమా కొన్నారు అంటే సాధారణంగా ఇండస్ట్రీలో నమ్మరు. వాళ్లు ఓ సినిమాను టోకుగా కొనేయ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. ఎంతో న‌మ్మ‌కం ఉండాలి… వాళ్లు ఒక‌టికి రెండుసార్లు సినిమా చూసుకోవాలి… బాగా న‌చ్చాలి అప్పుడే వాళ్లు ఆ సినిమాను టోకుగా కొంటారు. అయితే వాళ్ల బిజినెస్ తెలివితేట‌ల‌ను బ‌ట్టి చూస్తే సినిమాను పంపిణీ చేసేందుకు మాత్ర‌మే ఇష్ట‌ప‌డ‌తారు. అది కూడా వారు సేఫ్ జోన్‌లోనే ఉండి మాత్ర‌మే పంపిణీ చేస్తారు.

అలాంటి సురేష్‌బాబు, సునీల్ ఇప్పుడు యంగ్ హీరో శ‌ర్వానంద్ సినిమా ప‌డి ప‌డి లేచె మ‌న‌సు ఏపీ, తెలంగాణ రైట్స్ ఏకంగా రూ.21 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు రావ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. హ‌ను రాఘ‌వ‌పూడి యావ‌రేజ్‌, ప్లాప్ డైరెక్ట‌ర్‌. అత‌డి చివ‌రి సినిమా లై ఘోర‌మైన డిజాస్ట‌ర్‌. మ‌రి అత‌డు డైరెక్ట్ చేసిన సినిమాను వీళ్లు అంత రేటు పెట్టి ఎలా కొన్నారు ? అన్న ప్ర‌శ్న‌లు అంద‌రిలోనూ ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

అయితే వీరి ధీమా, ధైర్యం వెన‌క ఉంది హ‌ను కాద‌ట‌. హీరో శ‌ర్వానంద్ వ‌రుస హిట్ల‌తో ఉన్నాడు. అత‌డి సినిమాలు యావ‌రేజ్ మార్క్‌తో కూడా మంచి వ‌సూళ్లే రాబ‌డుతున్నాయి. ఇక సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ కావ‌డంతో ఆమె ఉంటే చాలు ఆమెను చూసేందుకు తెలుగు యువ‌త థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. ఫిదా త‌ర్వాత ఆమె రేంజ్ బాగా పెరిగిపోయింది. ఇదే వీరిద్ద‌రి ధైర్యం అట‌.

ఇక క‌మెడియ‌న్ సునీల్ చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమాలో కీల‌క‌మైన పాత్ర చేశాడు. అందుకే ప‌డి ప‌డి లేచె మ‌న‌సుపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. శాటిలైట్, డిజిట‌ల్‌, బెంగ‌ళూరు రైట్స్ క‌లిపితే మ‌రో రూ.10 కోట్లు రావొచ్చు. ఓవ‌ర్సీస్ ఉండ‌నే ఉంది. మొత్తానికి.. 35 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌ర‌గ‌డం ఖాయం. ఏదేమైనా ద‌ర్శ‌కుడి మీద న‌మ్మం క‌న్నా హీరోయిన్‌, హీరోల‌ను న‌మ్ముకుని సురేష్‌బాబు, సునీల్ బిజినెస్ చేయ‌డం నిజంగానే గ్రేట్‌.