సూపర్‌ స్టార్‌ను ఫిదా చేయబోతుందా... మహేష్‌ ఆమెను బుక్‌ చేశాడా?  

sai pallavi selected for mahesh babu 26th movie -

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలకు సిద్దం అయ్యింది.వచ్చే నెల 25వ తారీకున చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

TeluguStop.com - Sai Pallavi Selected For Mahesh Babu 26th Movie

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

మహేష్‌బాబు 26వ చిత్రంకు సంబంధించిన చర్చ ప్రస్తుతం జరుగుతుంది.సుకుమార్‌ దర్శకత్వంలో చేయాల్సిన మహేష్‌ 26వ చిత్రం అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు.

TeluguStop.com - సూపర్‌ స్టార్‌ను ఫిదా చేయబోతుందా… మహేష్‌ ఆమెను బుక్‌ చేశాడా-Movie-Telugu Tollywood Photo Image

అనీల్‌ సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మహేష్‌ బాబుకు జోడీగా అనీల్‌ రావిపూడి ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎంసీఏ చిత్రంతోనూ అలరించింది.ఆ తర్వాత చేసిన రెండు మూడు సినిమాలు అలరించలేదు.అయినా కూడా తెలుగులో ఈ అమ్మడికి మంచి క్రేజ్‌ ఉంది.తెలుగులో ఈమెకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి.పెద్ద ఎత్తున సినిమా ఆఫర్లు వస్తున్నా కూడా ఈమె మాత్రం మంచి కథలను చూసుకుని నటించాలని భావిస్తుంది.

***

తాజాగా మహేష్‌ బాబుతో నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడు నో చెప్పకుండా ఓకే చెప్పిందని తెలుస్తోంది.మహేష్‌ బాబుకు జోడీగా ప్రస్తుతం పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ తర్వాత సినిమాలో సాయి పల్లవి ఎంపిక అయిన నేపథ్యంలో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉన్నారు.సాయి పల్లవి తెలుగు మరియు తమిళంలో వరుసగా హిట్‌ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో మహేష్‌ బాబుతో చేస్తున్న సినిమా తో ఆమె కెరీర్‌ మరింత ముందుకు వెళ్లడం ఖాయం అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi Selected For Mahesh Babu 26th Movie Related Telugu News,Photos/Pics,Images..