మహిళలకి హైదరాబాద్ సేఫ్ అంటున్న సాయి పల్లవి  

Sai Pallavi Says Hyderabad Is Safest Place For Women\'s - Telugu Cyberabad, Hyderabad Is Safest Place For Women\\'s, Sai Pallavi, Telugu Heroins, Tollywood

ఫిదా బ్యూటీ సాయి పల్లవి సినిమాల ఎంపికలోనే కాకుండా సామాజిక విషయాలపై స్పందించడంలో కూడా తన ప్రత్యేకత చూపిస్తూ ఉంటుంది.అందరిలా సినిమాలో వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని అవకాశాలు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఆలోచనతో ఇష్టానుసారంగా సినిమాలు చేసే నైజం ఆమెకి లేదు.

Sai Pallavi Says Hyderabad Is Safest Place For Women's - Telugu Cyberabad Women\\'s Heroins Tollywood

కేవలం కథ, తన పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటుంది.అందుకే ఆమె కెరియర్ లో చేసిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.

అయితే అప్పుడప్పుడు తనలో ఉన్న సామాజిక, ఆద్యాత్మిక కోణాలు సాయి పల్లవి బయట పెడుతూ ఉంటుంది.

హెచ్ఐఐసీలో సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది.

ఈ సదస్సులో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఐజీ స్వాతిలక్రా టెస్సీ థామస్ సినీనటి సాయిపల్లవితో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా షీ సేఫ్ అనే ప్రత్యేక యాప్ ని సాయిపల్లవి ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపింది.మహిళలకు దేశంలో హైదరాబాద్లో ఉన్న భద్రత మరెక్కడా లేదని పోలీసుల భద్రతతో మహిళలు ప్రశాంతంగా ఉంటున్నారని తెలిపారు.

తమ కూతుళ్ళ విషయంలో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు భయపడటం లేదని పేర్కొంది.మొత్తానికి ఈ తరం హీరోయిన్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో డబ్బులు సంపాదిస్తూ ఉంటే సాయి పల్లవి మాత్రం ఇలా సామాజిక కార్యక్రమాలలో భాగం కావడం నిజంగా గొప్ప విషయం.

తాజా వార్తలు

Sai Pallavi Says Hyderabad Is Safest Place For Women\'s-hyderabad Is Safest Place For Women\\'s,sai Pallavi,telugu Heroins,tollywood Related....