సారంగదరియా రివ్యూ.. మరో ఫిదా వచ్చిండే అంటున్నారు

యూట్యూబ్‌ లో సాయి పల్లవి రౌడీ బేబీ, వచ్చిండే, ఎంసీఏ పాటలు అదరగొట్టేస్తున్నాయి.వందల మిలియన్‌ లు ఉన్న పాటలతో యూట్యూబ్‌ లో సాయి పల్లవి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది.

 Sai Pallavi Sarangadaria Song Dance Goes Viral-TeluguStop.com

ఇప్పుడు మరో పాటతో దుమ్ము దులిపేందుకు సిద్దం అయ్యింది.సాదారణంగా జానపదం అంటే తెలుగు వారు చెవులు కోసుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో సాయి పల్లవితో సారంగదరియా పాటను లవ్‌ స్టోరీ సినిమా లో చేయించడంతో శేఖర్‌ కమ్ముల మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా మొదటి నుండి కామెంట్స్ వస్తున్నాయి.సారంగదరియా పాట నేడు ఉదయం సమంత చేతుల మీదుగా విడుదల అయ్యింది.

 Sai Pallavi Sarangadaria Song Dance Goes Viral-సారంగదరియా రివ్యూ.. మరో ఫిదా వచ్చిండే అంటున్నారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లవ్‌ స్టోరీ సినిమా లో సాయి పల్లవి ఈ పాటకు చేసే డాన్స్ అదిరి పోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

పాటలో ఆమె డాన్స్ స్టెప్పులు కొన్ని చూపించారు.

వాటికే జనాలు ఫిదా అవుతున్నారు.ముందు ముందు మరింతగా కుమ్మేస్తుంది ఈ పాట అంటూ బలంగా కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ద ఎత్తున వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు సినిమాకు ఈ పాట ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్ ను ఆశిస్తున్నాం అంటూ తెలుగు సాయి పల్లవి అభిమానులు చెబుతున్నారు, రౌడీ బేబీ ఇప్పటికే బిలియన్‌ క్రాస్‌ చేసింది.

ఆ రేంజ్ లో కాకున్నా వచ్చిండే ఇతర పాటలను బీట్ చేసే రేంజ్ లో ఈ పాట ఉంటుందని యూట్యూబ్‌ లో ఓ మోత మోగిపోతుందని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా లో సాయి పల్లవి మరో సారి ఫిదాలో భానుమతి మాదిరిగా కనిపించబోతుంది.

ఇక సారంగదరియా పాటను మంగ్లీ అద్బుతంగా పాడింది.ఆమె గొంతుతో మరింతగా పాటకు మెరుగులు అద్దినట్లుగా అనిపించింది.

#Shekhar Kammula #LoveStory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు