దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న వారిలో సాయిపల్లవి ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సెలెక్టెడ్ కథలను ఎంపిక చేసుకుని చిత్రాలలో నటించడం వల్ల ఈమె ఎన్నో అద్భుతమైన విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ద్వారా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి ఇకపై తాను నటించే సినిమాలు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇకనుంచి సాయి పల్లవి తన కథల ఎంపిక విషయంలో మార్పులు చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే కామెడీ తరహాలో కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని ఇకపై అలాంటి సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను సందడి చేస్తానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు.
ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేసిన సాయిపల్లవి ఇకపై కామెడీ ద్వారా ప్రేక్షకులను సందడి చేయాలని భావించినట్లు తెలుస్తోంది.
తనలో కామెడీ యాంగిల్ కూడా దాగి ఉందని అందుకే వీలైనంత వరకు తన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నం చేస్తానని ఈ అమ్మడు చెప్పుకొచ్చారు .ఇక ప్రస్తుతం ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే నాని హీరోగా నటిస్తున్నటువంటి శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్నారు.ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.