పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయి పల్లవి.. టాలీవుడ్ హాట్ టాపిక్  

Sai Pallavi Romance With Pawan Kalyan In Krish Movie, Tollywood, Telugu Cinema, Mega Fans, Pawer Star Fans, - Telugu Krish Movie, Mega Fans, Pawan Kalyan, Pawer Star Fans, Sai Pallavi, Telugu Cinema, Tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది వరుస సినిమాలు చేయబోతున్నాడు.ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో క్రిష్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.

TeluguStop.com - Sai Pallavi Romance With Pawan Kalyan In Krish Movie

ఈ సినిమా పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఖుషి తర్వాత ఏ.ఎం.రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది.ఇదిలా ఉంటె ఇప్పటికే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రిలీజ్ చేసిన పోస్టర్ తో అతని పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుంది అనేది క్రిష్ రివీల్ చేశాడు.

TeluguStop.com - పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయి పల్లవి.. టాలీవుడ్ హాట్ టాపిక్-Gossips-Telugu Tollywood Photo Image

ఇక చాలా రోజులుగా ఈ సినిమా హీరోయిన్ల కోసం క్రిష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం ఇప్పటి వరకు చాలా మంది కథానాయికల పేర్లు వినిపించాయి.

బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్, ప్రగ్యా జైశ్వాల్ పేర్లు ఆరంభంలో వినిపించాయి.అయితే ప్రగ్యా ఈ సినిమాలో నటిస్తున్నా అది హీరోయిన్ పాత్ర కాదని ప్రచారం జరిగింది.

ఇంతలో రీసెంట్ గా నిధి అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది.ఇప్పుడు ఆమె స్థానంలో రౌడీ హీరోయిన్ సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

సాయి పల్లవిని క్రిష్ సంప్రదించాడని, ఆమె పాత్ర నచ్చడంతో చేయడానికి ఒకే చెప్పిందని టాక్ నడుస్తుంది.మొఘలాయిల కాలంలో ఒక జమీందారు కూతురు పాత్రలో సాయి పల్లవి ఈ సినిమాలో కనిపించబోతుందని ప్రచారంలో ఉంది.

అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ కానీ, సాయి పల్లవి కానీ క్లారిటీ ఇవ్వలేదు.సాయి పల్లవి గాని ఈ సినిమాలో నటిస్తే దీనికి మరింత క్రేజ్ రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

#Pawer Star Fans #Pawan Kalyan #Sai Pallavi #Mega Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు