నితిన్ తో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి

సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్

సాయి పల్లవి

ఇమేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం సాయి పల్లవి నటించిన లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

 Sai Pallavi Romance With Nithiin-TeluguStop.com

ఇక లవ్ స్టొరీ నుంచి రిలీజ్ అయిన సారంగాదరియా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.చాలా వేగంగా 150 మిలియన్ వ్యూస్ ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది.

దీంతో సినిమా మీద కూడా అంచనాలు క్రియేట్ అయ్యాయి.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అది కూడా సినిమాకి కొంత ప్లస్ అవుతుంది.

 Sai Pallavi Romance With Nithiin-నితిన్ తో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ తో థియేటర్స్ మూతపడిన కారణంగా ఈ రెండు సినిమాల రిలీజ్ వాయిదా పడింది.ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో సినిమాకి సైన్ చేసిందని తెలుస్తుంది.

యూత్ స్టార్ నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .మ్యాస్ట్రో సినిమా తర్వాత ఈ మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ కి జోడీగా సాయి పల్లవిని దర్శకుడు వక్కంతం వంశీ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఆమెకి దర్శకుడు రీసెంట్ గా కథ చెప్పడం జరిగిందని, కథలో తన పాత్ర నచ్చడంతోనే సాయి పల్లవి నటించడానికి ఒకే చెప్పిందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఎలాగూ సెకండ్ వేవ్ సిచువేషన్ నడుస్తుంది కాబట్టి మళ్ళీ పరిస్థితులు యధాస్థితికి వచ్చిన తర్వాత అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.

#Sai Pallavi #Nithiin #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు