సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్న నాగచైతన్య  

Sai Pallavi Romance With Naga Chaitanya -

ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఆ సినిమాలో సాయి పల్లవి చేసిన భానుమతి పాత్ర ఇప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకి గుర్తుకు వస్తూనే ఉంటుంది.

Sai Pallavi Romance With Naga Chaitanya

ఇదిలా ఉంటే టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఫిదా తరువాత తెలుగులో చేసిన పడి పడి లేచే మనసు ఎంసీఏ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.ఇక తమిళంలో చేసిన మారి 2 ఎన్జీకే సినిమాలు కూడా ఈ భామకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

అయితే మంచి కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుంటున్న సాయి పల్లవి సెలెక్టివ్ సినిమాలు చేసుకుంటూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది.

ఇందులో భాగంగా తాజాగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా కాంబినేషన్లో విరాటపర్వం అనే సినిమాలో నటించడానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే సాయి పల్లవిని ఫిదా సినిమాతో పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మరల ఈ భామతో మరో లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో సాయి పల్లవికి జోడిగా అక్కినేని హీరో నాగ చైతన్య కనిపించబోతున్నాడని సమాచారం.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోందని తెలుస్తుంది.దీనికంటే ముందు కొత్తవాళ్లతో లవ్ స్టోరీ తెరకెక్కించాలని ప్లాన్ శేఖర్ కమ్ముల ప్లాన్ చేసిన ఆ ప్రాజెక్టు ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ రావడం తో తాజాగా సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు అని తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమా సంబంధించి అధికారిక సమాచారం వచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi Romance With Naga Chaitanya- Related....