ఆ పాత్రలో సాయి పల్లవి విజయశాంతిని మరిపిస్తుందంట

టాలీవుడ్ లోలేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి విజయశాంతి.ఈమె స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలలో స్టెప్పులు వేసి తరువాత తానే హీరోగా మారిపోయింది.కర్తవ్యం సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.ఆ సినిమాకి ముందు వరకు విజయశాంతిని కమర్షియల్ హీరోయిన్ గా చూసిన దర్శక, నిర్మాతలు ఆమెని హీరోగా ఎలివేట్ చేస్తూ ఫీమేల్ సెంట్రిక్ కథలని తెరకెక్కించారు.

 Sai Pallavi Role Very Exciting In Virataparvam Movie , Rana Daggubati, Venu Udug-TeluguStop.com

అలాగే విజయశాంతి కారణంగానే టాలీవుడ్ కి యాక్షన్ హీరోయిన్లు పరిచయం అయ్యారంటే అతిశయోక్తి కాదు.అంతకుముందు కొంత మంది హీరోయిన్లు యాక్షన్ చేసిన అవి పూర్తిస్థాయి పాత్రలు కాదు.

కానీ విజయశాంతి మాత్రం సోలోగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో కమర్షియల్ హిట్స్ అందుకుంది.ఆమె కెరియర్ లో పోలీస్ పాత్రలతో పాటు నక్షలైట్ పాత్రలు ఎక్కువ చేస్తుంది.

నక్షలైట్ లో ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఒసేయ్ రాములమ్మ.

అమాయకమైన గిరిజన బాలిక జమీందార్లు కారణంగా అనేకసార్లు అత్యాచారాలకి గురై వారి వేధింపులు భరించలేక అడవిలోకి వెళ్లి నక్షలైట్ గా మారి అమాయకత్వాన్ని వదిలేసి వారి మీద భూస్వాముల మీద ప్రతీకారం తీర్చుకుంటుంది.

ఇక అమాయకమైన గిరిజన ఆడపిల్లగా, నక్షలైట్ గా విజయశాంతి ఆ సినిమాలో రెండుభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో జీవించి మెస్మరైజ్ చేసింది.ఇప్పుడు విరాటపర్వం సినిమాలో కూడా రౌడీ బేబీ సాయిపల్లవి అలాంటి పాత్రలోనే కనిపిస్తుంది.

అమాయకమైన గిరిజన అమ్మాయి అడవిలోకి వెళ్లి నక్షలైట్ గా ఎందుకు మారింది అనే ఎలిమెంట్ ని ఈ సినిమాలో సరికొత్తగా దర్శకుడు వేణు ఊడుగుల ఆవిష్కరిస్తున్నారు.రానా హీరోగా చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకి ప్రాణం పోసిందని, తన పాత్రతో విజయశాంతిని మరిచిపించడం గ్యారెంటీ అనే టాక్ విప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube