అనుకొని అతిథిగా భయపెట్టబోతున్న సాయి పల్లవి

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకొని, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి.ఈ బ్యూటీ డాన్స్ కి యూత్ లో మంచి ఇమేజ్ ఉంది.ఆమె పాటలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.రీసెంట్ గా లవ్ స్టొరీలో సారంగాదరియా సాంగ్ కూడా యుట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.తెలుగులో హై ఎనర్జీ ఉన్న పాత్రలని సాయి పల్లవిని ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది.విరాటపర్వం సినిమా కథ కూడా ఆమె పాత్ర పాయింట్ అఫ్ వ్యూ నుంచే నడుస్తుంది.

 Sai Pallavi Returns With Psycho Thriller, Anukoni Athidhi Movie, Fahadh Faasil,-TeluguStop.com

ఇదిలా ఉంటే మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి అక్కడ కంటెంట్ బేస్ చేసుకొని థ్రిల్లర్ జోనర్ లో ఎక్కువ సినిమాలు చేస్తుంది.

అలా ఫాహద్ ఫాజిల్ తో కలిసి అథిరన్ అనే మూవీలో నటించింది.

అందులో సాయి పల్లవి ఒక మానసిక రోగి పాత్రలో కనిపించింది.మానసిక సమస్యతో బాధపడుతున్న అమ్మాయి అనుకోకుండా కొంత మందిని హత్య చేస్తుంది.

అసలు దీని వెనుక కథ ఏంటి అనేది పాయింట్ తో ఈ చిత్రం ఉంటుంది.ఇప్పుడు ఈ మూవీని అనుకొని అతిథి టైటిల్ తో తెలుగులో డబ్ చేసి ఆహ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.

ఈ నెల28న ఈ మూవీ ఒటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాబోతుంది.మలయాళంలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెలుగు డిజిటల్ ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube