ఇది చదివిన తర్వాత సాయి పల్లవికి ఫిదా అయ్యి, హ్యాట్సప్‌ చెబుతారు  

Sai Pallavi Returns Her Remuneration For Padi Padi Lache Manasu-sai Pallavi,sharwanand Next Movie,viral About Sai Pallavi

మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో ఒక్కసారిగా సౌత్‌ ఇండియన్‌ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన సాయి పల్లవి అద్బుతమైన నటన మరియు డాన్స్‌లతో అలరిస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తూ వస్తోంది. తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో ఆకట్టుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నానితో ఎంసీఏ చిత్రాన్ని చేసింది.

Sai Pallavi Returns Her Remuneration For Padi Lache Manasu-Sai Sharwanand Next Movie Viral About

Sai Pallavi Returns Her Remuneration For Padi Padi Lache Manasu

ఆ రెండు సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇదే సమయంలో సాయి పల్లవికి పొగరు, ఆమె కోపిస్టి అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా శర్వానంద్‌ అవన్ని నిజం కాదని చెప్పాడు. అయినా కూడా సాయి పల్లవి గురించి జనాల్లో తప్పుడు సందేశమే ఉంది. కాని తాజాగా ఆమె చేసిన పనితో హ్యాట్సప్‌ చెప్పకుండా ఉండలేక పోతున్నారు.

సాయి పల్లవి తాజాగా తెలుగులో ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటించింది. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల నడుమ రూపొందింది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆడలేదు. సినిమా తీసిన తీరు బాగాలేదు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. సినిమాకు భారీగా నష్టాలు నమోదు అయ్యాయి. సినిమాకు నష్టాలు వస్తే అవి నిర్మాత మాత్రమే భరించాలి. హీరో, హీరోయిన్‌ ఇతర టెక్నీషియన్స్‌కు ఆ ఫ్లాప్‌, నష్టంతో సంబంధం లేదు. కాని బాధ్యత కలిగిన వారు మాత్రం ఆ ఫ్లాప్‌ను నెత్తిన వేసుకుంటారు.

పడి పడి లేచె మనసు ఫ్లాప్‌ అవ్వడంతో ఆ నష్టాల్లో కొంతైన భరించాలనే ఉద్దేశ్యంతో సాయి పల్లవి తన 40 లక్షల పారితోషికంను త్యాగం చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిర్మాతకు ఆ రిటర్న్‌ అమౌంట్‌ ఇచ్చి, దాన్ని డిస్ట్రిబ్యూటర్లలో కొంత మేరకైనా నష్టం పూడ్చాలని ఆమె భావించింది.

Sai Pallavi Returns Her Remuneration For Padi Lache Manasu-Sai Sharwanand Next Movie Viral About

హీరోయిన్స్‌ పారితోషికంను వదులుకోవడం, తిరిగి ఇవ్వడం అనేది ఇప్పటి వరకు చూడలేదు. కాని సాయి పల్లవి ఇలా చేసి ది గ్రేట్‌ అనిపించుకుంది. సౌత్‌ హీరోయిన్స్‌లో మంచి మనసున్న హీరోయిన్‌, నిర్మాతల నొప్పిని తెలుసుకున్న హీరోయిన్‌గా సాయి పల్లవి గుర్తింపు దక్కించుకుంది. అందుకే సాయి పల్లవికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటున్నాను.