పవన్ సినిమాకు నో చెప్పిన బ్యూటీ?  

Sai Pallavi Rejects Pawan Kalyan Movie, Sai Pallavi, Pawan Kalyan, Ayyappannum Koshiyum, Sagar Chandra, Tollywood News - Telugu Ayyappannum Koshiyum, Pawan Kalyan, Sagar Chandra, Sai Pallavi, Sai Pallavi Rejects Pawan Kalyan Movie, Tollywood News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు షూటింగ్ ముగించుకుని రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - Sai Pallavi Rejects Pawan Kalyan Movie

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా తరవాత తన నెక్ట్స్ చిత్రాలను ఇప్పటికే ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు పవన్.

ఈ క్రమంలో మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతలను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రకు అప్పగించారు చిత్ర యూనిట్.

TeluguStop.com - పవన్ సినిమాకు నో చెప్పిన బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.

ఈ మేరకు ఆమెను సంప్రదింపులు కూడా చేసినట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదని, ఆమె ప్రస్తుతం ఓకే చేసిన ప్రాజెక్టులు పూర్తి చేశాకే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో పవన్ నటించే చిత్రాన్ని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చిత్ర యూనిట్‌కే తెలియాలని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమాలో పవన్ సరస హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది చూడాలి.

#Sagar Chandra #Sai Pallavi #Pawan Kalyan #SaiPallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi Rejects Pawan Kalyan Movie Related Telugu News,Photos/Pics,Images..