కోటి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ఫిదా పోరీ  

Sai Pallavi Rejects One Crore Offer-endorsements,one Crore Offer,sai Pallavi,tollywood News

ఫిదా సినిమాతో తెలుగు జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది మలయాళ గుమ్మ సాయి పల్లవి.ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు తమ సొంత ఇంటి అమ్మాయిలా సాయి పల్లవిని ట్రీట్ చేయడం మొదలుపెట్టారు.ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ బ్యూటీగా సాయి పల్లవి ఫేం సంపాదించింది.ఇక ఆ తరువాత అమ్మడు చేసే ప్రతి సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Sai Pallavi Rejects One Crore Offer-endorsements,one Crore Offer,sai Pallavi,tollywood News Telugu Tollywood Movie Cinema Film Latest News Sai Pallavi Rejects One Crore Offer-endorsements One Offer Sa-Sai Pallavi Rejects One Crore Offer-Endorsements One Offer Sai Tollywood News

సాయి పల్లవి చేసిన ప్రతి సినిమాను అదే తరహాలో ఆదరిస్తున్నారు తెలుగు ఆడియెన్స్.కాగా ప్రస్తుతం సాయి పల్లవి ఆచితూచి సినిమాలు చేస్తోంది.ఏదిపడితే అది ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి యాడ్‌లలో నటించిన దాఖలాలు లేవు.

ఫేం ఉన్నప్పుడే హీరోయిన్లు పలు యాడ్‌లలో నటిస్తూ చేతినిండా సంపాదిస్తుంటారు.కానీ ఫిదా పోరి మాత్రం తాను ఇలాంటి వాటికి చాలా దూరం అంటూ చెబుతోంది.కాగా తాజాగా ఓ యాడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సాయి పల్లవికి ఏకంగా రూ.కోటి ఆఫర్ వచ్చింది.

కానీ తనకు యాడ్‌లలో నటించడం ఇష్టం లేదంటూ కోటి ఆఫర్‌ను కాలి గోటిలా తీసిపడేసింది ఈ బ్యూటీ.ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా సినిమాలపైనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది.అటు తెలుగులో సాయి పల్లవి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది.నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో సాయి పల్లవి నటిస్తోండగా, రానా కథానాయకుడిగా తెరకెక్కుతోన్న మరో సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తోంది.