చరణ్‌తో జతకడుతున్న భానుమతి.. నిజమా అంటోన్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు.

 Sai Pallavi To Romance Ram Charan, Sai Pallavi, Ram Charan, Acharya, Chiranjeevi-TeluguStop.com

కాగా ఈ సినిమాలో చిరంజీవి ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడు.అయితే ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

కాగా చరణ్ ఎలాంటి కేమియో పాత్రలో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ చేయబోయేది ఓ నక్సలైట్ పాత్ర అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో చరణ్‌కు హీరోయిన్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.అయితే చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా గతంలో ఈ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఆలియా భట్‌ల పేర్లు వినిపించినా వారు ఈ సినిమాలో నటించడం లేదని తేలిపోయింది.

అయితే ఈ సినిమాలో చరణ్ సరసన నటించేందుకు అందాల భామ సాయి పల్లవిని సంప్రదించాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోయే పాత్ర కావడంతో, ఈ పాత్రను సాయి పల్లవి అయితే బాగా చేయగలదని కొరటాల భావిస్తున్నాడు.ఇప్పటికే ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవి ఇలాంటి పాత్రనే చేస్తుండటంతో మరోసారి అలాంటి పాత్ర చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube