దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి సాయి పల్లవి ( Sai PalIavi ) ఇదివరకు సౌత్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండేవారు.ప్రేమమ్ ( Premam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తెలుగులోకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
తమిళంలో శివ కార్తికేయన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నటువంటి ఈమె తెలుగులో నాగచైతన్య ( Nagachaitanya ) సరసన తండేల్ ( Tandel ) సినిమాలో నటిస్తున్నారు.వీటితోపాటు హిందీలో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారు.ఈ సినిమా ఇటీవల జపాన్లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్( Junaid Khan ).హీరోగా హిందీలో తొలి సినిమా చేస్తున్నాడు.ఇందులోనే సాయిపల్లవి హీరోయిన్.కొన్నాళ్లుగా జపాన్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపకుంటుంది.
ఈ విధంగా జపాన్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో చిత్ర బృందం మొత్తం చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే జపాన్లో ఒక పబ్ లో ఈ పార్టీ జరిగింది.ఇందులో భాగంగా సాయి పల్లవి ఓ పాటకు అద్భుతమైనటువంటి డాన్స్ వేస్తూ కనిపించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె డాన్స్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది సాయి పల్లవి పక్కన స్టార్ హీరోలు సైతం డాన్స్ చేయడానికి తడబడుతూ ఉంటారు.ఇలా అద్భుతమైనటువంటి డాన్స్ చేసే సాయి పల్లవి తాజాగా పబ్ లో చేసినటువంటి ఈ డాన్స్ వీడియో వైరల్ గా మారడంతో అందరూ ఈ వీడియో పై సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.