సాయి పల్లవి కష్టం ఊహాతితం.. ఒక్క పాట కోసం ఎన్ని కష్టాలో..!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయిపల్లవి ఎంతో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకొని విజయ పథంలో దూసుకుపోతుంది.

 Sai-pallavi Pranavalayam Song-dance Rehearsal Video Goes Viral Sai Pallavi, Pran-TeluguStop.com

ఇక ఈమె సినిమాలలో చేసే డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె డాన్స్ చేస్తే నెమలి పురివిప్పి నాట్యమాడుతుందనే రీతిలో ఉంటుంది.

ఈ క్రమంలోనే సాయిపల్లవి నటించిన రౌడీ బేబీ, వచ్చిందే  పిల్లా, ఏమండోయ్ నాని గారు, సారంగ దరియా అనే పాటలకు తన అద్భుతమైన నాట్యంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుందని చెప్పవచ్చు.ఈ విధంగా ప్రతి పాటల్లో అద్భుతమైన స్టెప్పుల ద్వారా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచిన సాయిపల్లవి తాజాగా నాని సరసన నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్ర ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు.

తాజాగా సాయి పల్లవి సోషల్ మీడియా ద్వారా ఒక డాన్స్ వీడియోని షేర్ చేశారు.ఇందులో శ్యామ్ సింగరాయ్ సినిమాలోని ‘ప్రణవాలయ’పాటకు అద్భుతమైన డాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు అందుకున్నారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి ఈ పాటకు రిహార్సల్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ… ఈ పాటకు డాన్స్ చేస్తుంటే నాకు కలిగిన అనుభూతి మాటలలో చెప్పలేను.నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ఈ పాట ముందు వరుసలో ఉంటుంది.

రూపాలి కంథారియా, కుష్బూ వాకానిలకు ఈ క్రెడిట్స్ దక్కాలనిసాయి పల్లవి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తుంటే ఈ పాట వెనుక సాయి పల్లవి పడిన కష్టం ఎంత ఉందో అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube