చిన్నప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించినటువంటి “ఫిదా” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన టువంటి సాయి పల్లవి తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.అంతేగాక ఈ చిత్రంలో తెలంగాణ  యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

 Sai Pallavi, Pooja, Childhood Images, Love Story, Fidha, Shekar Kammula, Tollywo-TeluguStop.com

అయితే ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో సాయి పల్లవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించినటువంటి పలు ఆసక్తికర అంశాలను తన అభిమానులతో పంచుకుంటోంది.

అయితే తాజాగా సాయి పల్లవి చిన్నప్పుడు సాయి పల్లవి మరియు తన చెల్లెలు కలిసి తీయించుకున్న ఓ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో సాయి పల్లవి చిన్నప్పటి ఫోటోకి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేగాక చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన ఒక్కరోజులోనే దాదాపుగా మూడు లక్షల ఎనభై ఆరు వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న “లవ్ స్టోరీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లను మూసివేయడంతో కొంత కాలం తాత్కాలికంగా ఈ చిత్రం విడుదలను నిలిపి వేశారు.ప్రస్తుతం సాయిపల్లవి టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్నటువంటి విరాటపర్వం అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పనులు కూడా మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube