తెలంగాణ జానపద గాయని బెల్లి లలిత పాత్రలో సాయి పల్లవి  

Sai Pallavi Play The Belli Lalitha Role In Virataparvam Movie-

సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి.మొదటి సినిమా ఫిదాతోనే టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన ఈ తమిళ బ్యూటీ తరువాత ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది.దీంతో స్టార్ హీరోలతో సైతం నటించే అవకాశం వచ్చిన ఆమె పెట్టుకున్న కొన్ని షరతుల ప్రకారం పాత్ర ప్రభావం లేకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది...

Sai Pallavi Play The Belli Lalitha Role In Virataparvam Movie--Sai Pallavi Play The Belli Lalitha Role In Virataparvam Movie-

ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అవకాశం మిస్ చేసుకుంది.ఈ పాత్రకి రష్మికని దర్శకుడు ఫైనల్ చేసుకున్నాడు.ఇలా సాయి పల్లవి వదిలేస్తున్న సినిమాలన్నీ రష్మిక లిస్టులోకి వెళ్ళిపోతున్నాయి.

ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా చిత్రంలో నటించిన సాయి పల్లవితెలంగాణ అమ్మాయిల కనిపించి తన వాయిస్ తో ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత నాని సరసన ఏంసిఏ చిత్రంలో నటించింది.ఇందులో కూడా వరంగల్ అమ్మాయి గా కనిపించింది.

Sai Pallavi Play The Belli Lalitha Role In Virataparvam Movie--Sai Pallavi Play The Belli Lalitha Role In Virataparvam Movie-

ఇప్పుడు మరోసారి తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతుంది.రానాతో కలిసి విరాటపర్వం అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది.వేణు ఉడుగుల డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది.

నక్సలిజం స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి వరంగల్ కి చెందిన జానపద కళాకారునిగా కనిపిస్తుందట.ఈ పాత్రని దర్శకుడు నయీం చేతిలో హత్యకి గురైన తెలంగాణ జానపద గాయని బెల్లి లలిత స్ఫూర్తితో రాసుకున్నట్లు తెలుస్తుంది.మరి ఈ సరి తెలంగాణ ఫోక్ సింగర్ పాత్రలో సాయి పల్లవి ఏ రేంజ్ లో మెప్పిస్తుంది అనేది చూడాలి.