చిరు మూవీ.. సాయి పల్లవి, కీర్తిసురేష్‌ల మద్య ఊగిసలాట  

sai pallavi or keerthi suresh is for chiranjeevi sister role Chiranjeevi, Keerthi Suresh, Sai Pallavi, Acharya, Koratala Siva, Vedhalam, Pawn Kalyan, Mehar Ramesh - Telugu @sai_pallavi92, Acharya, Chiranjeevi, Keerthi Suresh, Koratala Siva, Mehar Ramesh, Pawn Kalyan, Sai Pallavi, Vedhalam

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా త్వరలో పూర్తి కాబోతుంది.

TeluguStop.com - Sai Pallavi Or Keerthi Suresh Is For Chiranjeevi Sister Role

ఆచార్య సినిమా షూటింగ్‌ పూర్తి కాకముందే చిరంజీవి మరో సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు గా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి లో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంను చిరంజీవి రీమేక్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు.అజిత్ నటించిన వేదాళం సినిమా తమిళనాట సెన్షేషనల్‌ హిట్ గా నిలిచింది.

TeluguStop.com - చిరు మూవీ.. సాయి పల్లవి, కీర్తిసురేష్‌ల మద్య ఊగిసలాట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందుకే తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేసేందుకు మొదట పవన్ కళ్యాణ్ గారు ఆసక్తి చూపించారు.కాని కొన్ని కారణాల వల్ల రీమేక్ ను ఆయన పట్టాలెక్కించలేక పోయారు.

ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి ఆ రీమేక్‌ ను చేసేందుకు సిద్ధమయ్యారు.

సినిమాలో హీరోయిన్ పాత్ర కంటే హీరో చెల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

అందుకే ఆ పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొన్నటి వరకు సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపించింది.చిరంజీవికి చెల్లి పాత్రలో సాయి పల్లవి నటించబోతుంది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా ఆ పాత్రకు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి ఇప్పటికే వారిద్దరిలో ఎవరైనా ఓకే అన్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.దాంతో దర్శకుడు మెహర్ రమేష్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కేవలం నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు మెహర్‌ రమేష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

చాలా కాలం గ్యాప్‌ తర్వాత దర్శకుడు మెహర్‌ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాతో ఆయన మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆశపడుతున్నాడు.

#Vedhalam #Mehar Ramesh #@Sai_Pallavi92 #Acharya #Pawn Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi Or Keerthi Suresh Is For Chiranjeevi Sister Role Related Telugu News,Photos/Pics,Images..