సాయి పల్లవి మాతృభాషకి లిపి లేదంటా  

Tollywood Kollywood South Cinema Sai Pallavi Fidha - Telugu Kollywood, Sai Pallavi Open Up Her Personal Life, South Cinema, Tollywood

టాలీవుడ్ లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులని ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్న బ్యూటీ సాయి పల్లవి.తెలుగులో డీ షో డాన్సర్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ దుమ్ము దులిపిన సాయి పల్లవి తరువాత మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.

 Tollywood Kollywood South Cinema Sai Pallavi Fidha

మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో మెస్మరైజ్ చేసింది.ఇక ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ తరువాత ఎంసిఏ, పడిపడి లేచే మనసు సినిమాలు చేసింది.

ప్రస్తుతం లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.ఇక ఆమె నటించిన మారి2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంతగా యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సాయి పల్లవి మాతృభాషకి లిపి లేదంటా-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.సినిమాల్లో నటించేందుకు తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నాను ఈ కారణంగానే అన్ని సినిమాలు కాకుండా సెలక్టివ్ గా మనసుకి నచ్చే పాత్రలు మాత్రమే చేస్తున్నా అని చెప్పింది.

తాను తమిళనాడులోని కోటగిరి ప్రాంతంలోని బడగ సామాజిక వర్గానికి చెందిన అమమయిని అని తమ మాతృభాషకి లిపి కూడా లేదని చెప్పింది.తన చదువు కూడా కోయంబత్తూరులోనే జరిగింది.

స్టూడెంట్ గా ఉన్నప్పుడు తమిళ హీరో సూర్య అంటే విపరీతమైన అభిమానం ఉండేది.సినిమాల్లోకి వచ్చాక సూర్యతో సినిమా చేయడం సంతోషాన్నిచ్చింది.

ఫిదా సినిమా కోసమే ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నానని కొత్త విషయాలు నేర్చుకోవడంపై తనకు ఆసక్తి ఎక్కువని చెప్పింది.అలాగే తనకి డాన్స్ అంటే చాలా ఇష్టమని కూడా ఈ భామ చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi Open Up Her Personal Life Related Telugu News,Photos/Pics,Images..