శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లవ్ స్టోరీ ఇందులో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటీనటులు గా నటిస్తున్నారు.ఈ సినిమా ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది.శ్రీ వెంకటేశ్వర సినిమా, ఎల్ ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులనుండి ప్రశంసలు అందుకున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో ప్రతి ఒక్క పాట బాగా ఆకట్టుకోగా ఈమధ్య యూట్యూబ్ లో హల్ చల్ గా మారిన సారంగదరియాఅనే పాట మాత్రం ఎంత క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంతేకాకుండా ఈ పాట ప్రస్తుతం ఓ రికార్డును సాధించిందని చెప్పవచ్చు.

ఈ పాట ఫిబ్రవరి 28న అక్కినేని సమంత చేతుల మీదుగా విడుదల చేసిన కొద్ది కాలంలోనే యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ ల మంది వీక్షించారు.ఇక ఈ పాట సుద్దాల అశోక్ తేజ రచించగా గాయని మంగ్లీ ఈ పాటను వినిపించారు.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ పాట పై తెగ డాన్సులు కూడా చేస్తున్నారు నెటిజనులు.అంతేకాకుండా టిక్ టాక్ స్టార్స్ మాత్రం ఈ పాటను తెగ వాడేసుకుంటున్నారు.ఇటీవలే ఈ పాట గురించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి.
ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలో నటించారు.మొత్తానికి ఈ పాట ద్వారా ఈ సినిమా మరింత విజయాన్ని అందుకుంటుందని తెలుస్తుంది.
